Political News

సీజ్ ఫైర్ పై భారత్, పాక్ రియాక్షన్

భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ప్రకటించారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఈ నెల 12న పాకిస్థాన్ విదేశాంగ శాఖతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓ, పాక్ డీజీఎంఓలకు ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరామని మిస్రీ తెలిపారు.

భూ,గగన, సముద్రతలాలకు కాల్పుల విరమణ వర్తిస్తుందని చెప్పారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరుగుతాయన్నారు. పాక్ మంత్రి ఇషాక్‌దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు వెల్లడించారు. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరపడినట్లయింది.

కాగా, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉన్న పలు రాష్ట్రాలలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్న వార్త విని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

This post was last modified on May 10, 2025 6:59 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

2 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago