Political News

ఈ టైం లో పాక్ కి అప్పు ఇచ్చిన IMF

ఎంతమంది నేతలు మారినా పాకిస్తాన్‌లో ఆర్థిక కష్టాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దేశం ఎదుగుదలపై దృష్టి పెట్టడం కంటే రోజూ భారత్‌పై ఆరోపణలు చేయడం, కాశ్మీర్ కోసం గొడవపడడం పాక్ ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యం. ఈ పరిస్థితిపై పాకిస్తాన్ ప్రజలే ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. “ముందు మనం తినడానికి సరిపడే ఎదుగుదల గురించి ఆలోచించండి?” అని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులోనూ IMF ఇచ్చిన తాజా బిలియన్ డాలర్ల అప్పు మరింతగా చర్చకు దారితీస్తోంది.

IMF అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund), ఇది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. దీని ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాలకు రుణాలు, సాంకేతిక సహాయం అందించి వాటి ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడం.

అయితే గతంలో పాక్ ఎన్నో సార్లు IMFను “ప్రజల ఆకలిని తీరుస్తాం” అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ సమయంలో IMF పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగిన సందర్భంలో మాత్రం అప్రూవల్ అతి వేగంగా రావడం వింతగా ఉంది. IMF చూపించిన సపోర్ట్ వెనుక వాస్తవం వేరేమోనని అంతర్జాతీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ చైనా పాత్రపై మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది. చైనా డైరెక్ట్ గా మధ్యలోకి రావాలంటే అంత సులభం కాదు, ఎందుకంటే రష్యా ఈ పరిస్థితుల్లో మరింత బలంగా భారత్ వెనక నిలిచే అవకాశముంది. అందుకే చైనా బ్యాక్‌డోర్‌లో, అంటే IMF వంటి వేదికల ద్వారా పాక్‌కి సపోర్ట్ చేస్తుందేమో అన్నది ఇప్పుడు ప్రధాన అనుమానం. IMF వంటి సంస్థల్లో చైనా ప్రాబల్యం గణనీయమైనది. చైనా అండతోనే ఇంత వేగంగా ఆమోదం వచ్చిందా? అనే దానిపై పలు రాజకీయ వర్గాలు చర్చ మొదలు పెట్టాయి.

పాక్‌ను ఆకలితో కుస్తీ పడుతున్నప్పుడు IMF కనికరం చూపకపోగా, ఇప్పుడు యుద్ధ వేళ మాత్రం అతి వేగంగా ఆర్థిక సహాయం అందించడం వెనుక కారణాలు సూటిగా అర్థం కావు. నిజంగా ఇది పాక్ ప్రజల కోసం వెళ్తుందా? మరింత సైనిక వ్యూహాలకు, దాడులకు ఇంధనం అవుతుందా? అన్నది కీలక ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరింత జాగ్రత్తగా రాజకీయ అంచనాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది.
`

This post was last modified on May 10, 2025 12:58 pm

Share

Recent Posts

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

9 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

1 hour ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago