Political News

హిట్ ఫార్ములా నే మరో సారి నమ్ముకున్న జగన్

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఏపీకి ముఖ్యమంత్రి కాలేరు. నాలుగేళ్ల సమయం ఉందని రాజకీయ నేతలు అలా ఖాళీగా కూర్చోలేరు కదా. అందుకే కాబోలు…2029 ఎన్నికల్లో విజయం దక్కించుకునే దిశగా ఇప్పుడే వ్యూహాలు రచించుకుంటున్న జగన్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా 2027లో తాను మరోమారు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.

ఈ మేరకు బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటు ఇంచార్జీలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్రపై ప్రకటన చేశారు. ఇదివరకే జగన్ 2.0 పాదయాత్రపై మొన్నామధ్య పార్టీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ ప్రకటన నిజమేనన్నట్లుగా తన పాదయాత్రపై జగన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. 2019 ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన పాదయాత్ర తరహాలోనే 2029 ఎన్నికలకు ముందుగా 2027లో పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు.

మరోమారు పాదయాత్రతో తాను మరోమారు సీఎం అవ్వడం ఖాయమేనన్న రీతిలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న జగన్…అదే విషయాన్ని తాను చేపట్టిన పాదయాత్రలో జనం వద్ద ప్రస్తావించానని గుర్తు చేశారు. తన పాదయాత్ర తో చంద్రబాబు మోసాన్ని జనం గుర్తించి వైసీపీపి గెలిపించారని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా 2014 పరిస్థితులే ఉన్నాయన్న జగన్… 2027లో చేపట్టే పాదయాత్రతో జనం వైసీపీకి విజయం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇక 2027లో చేపట్టే పాదయాత్రకు సంబంధించిన విస్పష్ట ప్రకటన, పార్టీ రాజకీయ వ్యూహాల ప్రకటనలను వచ్చే ఏడాది నిర్వహించే పార్టీ ప్లీనరీలో చేస్తానని జగన్ చెప్పారు. ప్లీనరీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇక 2029 ఎన్నికల్లో పార్లమెంటు ఇంచార్జీలు తమ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నింటిని గెలిపించుకుని వస్తారన్న దాని ఆధారంగా వారికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలకూ ఇదే వర్తిస్తుందన్నారు. ఈ దఫా కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా తమ పాలన ఉంటుందని, ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు చేరవేయాలని ఆయన నేతలకు సూచించారు.

This post was last modified on May 8, 2025 10:18 am

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

5 hours ago