రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ఎక్కువ సినిమాలు హీరోయిన్ గా చేసినవాళ్లలో జయప్రద ముఖ్యులు. అప్పట్లో ఈ కలయికలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు బాహుబలి అంటున్నాం కానీ అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే రూపొందిన 1986 ‘తాండ్ర పాపారాయుడు’లో నటించిన ఈ జంటని అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. అప్పట్లో ఈ సినిమాకైన బడ్జెట్ గురించి పత్రికల్లో కథలు కథలుగా వచ్చేవి. కృష్ణ సింహాసనంకు ధీటుగా తీశారని విమర్శకులు ప్రశంసలు గుప్పించారు.
దీని కన్నా ముందు కృష్ణంరాజు – జయప్రద కాంబోలో మధుర స్వప్నం, సీతారాములు, అగ్ని పూలు, యుద్ధం, రంగూన్ రౌడీ, కురుక్షేత్రం, ప్రళయ రుద్రుడు, సుమంగళి, గోల్కొండ అబ్బులు, తల్లి కొడుకుల అనుబంధం, నిజం చెబితే నేరమా, ఉగ్రనరసింహం, సర్దార్, నాకు స్వాతంత్రం వచ్చింది, ఒకే రక్తం, టాక్సి డ్రైవర్, అడవి సింహాలు, విశ్వనాథ నాయకుడు, కుటుంబ గౌరవం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందుకే వీళ్లది లక్కీ పెయిర్ అని పేరు.
ఇన్ని దశాబ్దాల తర్వాత జయప్రద గారు తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫౌజీలో ప్రభాస్ తల్లిగా చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని సమాచారం. లెన్త్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందట. ముఖ్యంగా ఆవిడకు ప్రభాస్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని అంటున్నారు. కృష్ణంరాజు గారు కనక ఇప్పుడు ఉంటే ఈ ఎపిసోడ్స్ చూసి ఎంతగానో మురిసిపోయేవారని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.
డిసెంబర్ 3 విడుదలకు రెడీ అవుతున్న ఫౌజీ ఎలాంటి వాయిదా లేకుండా వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. చివరి షెడ్యూల్ లో ప్రభాస్ ఈ వారమే అడుగు పెడుతున్నాడు. ఇది నాన్ స్టాప్ గా జరుగుతుంది. ఇది పూర్తయ్యే దాకా స్పిరిట్ కి చిన్న బ్రేక్ ఇవ్వనున్నారు. రిలీజ్ డేట్ ఒత్తిడి అధికంగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ వార్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
This post was last modified on July 31, 2026 8:25 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…