Political News

త్వరలో బొద్దింకల అధినేత అభిజిత్ పెళ్లి

దేశ విదేశాల్లో అతి తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న సీజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కు డిమాండ్ పెరిగింది. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన ఇమేజ్ పెరిగింది. దాంతో మా పార్టీలో చేరమంటే మా పార్టీలో చేరమని ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. అధికార బీజేపీ అయితే మా పార్టీలో చేరుతావా లేకపోతే నీ సంగతి తేల్చమంటావా అంటూ బెదిరింపులకు పాల్పడుతుందని స్వయంగా దీప్కే వెల్లడించడం సంచలనం సృష్టించింది. కాసేపు రాజకీయాలను పక్కన పెడితే… అభిజిత్ దీప్కే కు పెండ్లి సంబంధాలు వెల్లువగా వస్తున్నాయని ఆమె తల్లి అనితా దీప్కే చెబుతున్నారు.

ఎవరీ దీప్కే …

పూణేలో జర్నలిజంలో డిగ్రీ చదివిన అభిజిత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్ లో రెండు సంవత్సరాల పీజీ పూర్తి చేశాడు. 2020-23 మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేశాడు. ఈ ఏడాది మే నెలలో సీజేఐ సూర్య కాంత్ యువతను కాక్రోచ్ లతో పోల్చడంతో కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజికీ వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులు చేసిన ఆందోళన తో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడంతో అభిజిత్ దీప్కే కు హీరో ఇమేజ్ వచ్చింది.

ఈ ఏడాది పెండ్లి…

అమెరికాలో పీజీ చేస్తున్నప్పుడు పెండ్లి గురించి ప్రస్తావించినప్పుడు నవ్వుతూ తిరస్కరించే వాడని, ఈ ఏడాదిలో అభిజిత్ పెండ్లి చేయాలని నిర్ణయించినట్లు అనితా దీప్కే మీడియాకు వెల్లడించారు. జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత పిల్లనిస్తామని బంధువులు, ఇతరులు సంబంధాలు తెస్తున్నారని తెలిపారు. తన కుమారుడు అభిజిత్ తీసుకునే నిర్ణయానికి కుటుంబం మద్దతు ఉంటుందని తెలిపారు. మొత్తంమీద యువతరం ప్రతినిధి దీప్కే త్వరలో పెళ్లి కుమారుడు కావడం ఖాయమని చెప్పొచ్చు.

This post was last modified on July 31, 2026 5:44 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

24 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

36 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago