Political News

నిమ్మగడ్డ కి పోలింగ్ సిబ్బంది ట్విస్ట్

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు లేదంటు ఏపిఎన్జీవో నేతలు స్పష్టంగా చెప్పారు. కరోనా కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్ధితులు రాష్ట్రంలో లేవని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహించాలంటే ముందు భారం పడేది పోలింగ్ సిబ్బందిపైనే అన్న విషయాన్ని నేతలు గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్దితుల్లో ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు ఉద్యోగులు ఎవరు ముందుకు రావటం లేదన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ తమ అభ్యంతరాలను కాదని ఎన్నికల నిర్వహణకే నిమ్మగడ్డ మొగ్గుచూపితే తాము కోర్టును ఆశ్రయిస్తామని కూడా నేతలు హెచ్చరించారు. అయితే, వీరే ఈ మాటలు చెప్పారా? లేక వీరి చేత ఎవరైనా ఈ మాటలు చెప్పించారా అన్న చర్చకూడా జరుగుతోంది. ఎందుకంటే ఇపుడు సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారు. ఇతర విధుల్లో ఉంటే రాని కరోనా ఎన్నికల విధుల వల్లే వస్తుందా? అన్నది మౌలిక ప్రశ్న.

ఇదిలా ఉంటే వారు తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేలమంది ఉద్యోగులు కరోనా వైరస్ భారిన పడిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. లాక్ డౌన్ లో భాగంగా విధినిర్వహణలో సుమారు 11 వేల మంది పోలీసులు కరోనా వైరస్ భారిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్ భారిన పడ్డారని చెప్పారు. పోలీసులు+ ఉద్యోగుల్లో కొన్ని వందలమంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. ఎన్నికల కారణంగా కరోనా భారిన పడటానికి తమ ఉద్యోగుల్లో ఎవరు ఇష్టపడటం లేదన్నారు.

ముఖ్యంగా రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఎన్నికల విధులంటేనే భయపడుతున్నట్లు నేతలు చెప్పారు. పోలీసులు, ఉద్యోగులు లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని సూచించారు. పదవిలోనుండి దిగిపోయేలోగా ఎన్నికలను నిర్వహించేయాలన్న పంతానికి నిమ్మగడ్డ వెళితే తాము కూడా కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. వ్యవహారం చూస్తుంటే ఎన్నికల నిర్వహణపై ఏపిఎన్జీవోలు కోర్టులో కేసు వేసేట్లే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే నిమ్మగడ్డ చెప్పేశారు కాబట్టి. మరి ఉద్యోగులెవరు ఎన్నికల నిర్వహణలో పాల్గొనేది లేదని చెప్పిన విషయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on November 5, 2020 1:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

1 hour ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

1 hour ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

3 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

5 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

7 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

9 hours ago