కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు దారి తప్పుతున్నాయా? ఎవరికి వారే అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తు న్నారా? సైకిల్ దారి తప్పుతోందా? అంటే.. ఔననే సంకేతాలే వస్తున్నాయి. వ్యక్తిగత వివాదాలతో కొందరు వ్యాపార విషయాలతో కొందరు.. మనకెందుకులే అని అనుకునే వారు మరికొందరు.. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కవుతున్న వారు ఇంకొందరు.. ఇలా టీడీపీని.. పార్టీ అధినేతను పట్టించుకునే నాయకులు కనిపించడం లేదన్నది విశ్లేషకుల భావన. కర్నూలు నగర టీడీపీ ఇంచార్జ్‌గా టీజీ భరత్ ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయినా.. ఆయననే నగర పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగిస్తున్నారు. అయితే, ఆయన తండ్రి, ఎంపీ.. టీజీ వెంకటేష్.. బీజేపీలో ఉండడం.. వ్యాపార వ్యవహారాల రీత్యా.. ఢిల్లీ చుట్టూ తిరగడం, వారి కార్యకలాపాల్లో వారు మునిగిపోవడంతో పార్టీని పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. ఇక, పాణ్యం నుంచి గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన గౌరు చరితారెడ్డి.. కూడా తనకెందుకులే అనుకుంటున్నారు. స్థానికంగా వారిని పట్టించుకునే వారు లేకపోవడం, పార్టీలో ఆశించిన పదవులు దక్కకపోవడంతో పార్టీ మారే ఆలోచనలు కూడా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పరిస్థితి వ్యక్తిగత వివాదాల్లో కూరుకుపోతున్నట్టే కనిపిస్తోంది. ఆమె సొంత పార్టీ నేతలతోనే వివాదాలకు రెడీ కావడం, నువ్వు ఒకటంటే.. నే రెండంటా! అంటూ.. విరుచు కుపడడం.. మరీముఖ్యంగా నాగిరెడ్డి బెస్ట్ ఫ్రెండ్.. ఏవీ సుబ్బారెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించడం.. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో.. తమ హవానే కొనసాగేలా.. సొంత పార్టీ నేతలపై ఆధిపత్యం ప్రదర్శించడం వంటివి.. ఆమెను పార్టీలో ఒంటరిని చేస్తున్నాయి. ఇక, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఇటీవల పార్టీలో పదవి ఇచ్చినా.. ఆయన గడప దాటడం లేదు.. పెదవి విప్పడం లేదు.
ఇక, కృష్ణమూర్తి కుమారుడు.. గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్యాంబాబు.. కూడా మౌనంగా తన పనితాను చేసుకుంటున్నారు. దీంతో వీరి కుటుంబం నుంచి కూడా అలికిడి వినిపించడం లేదు. ఇక, మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం కూడా టీడీపీలోకి వచ్చి గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు సాధించి.. పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు.. పార్టీకి అనుకూలంగా కాలు కదిపింది కూడా లేదు. ఇలా మొత్తంగా కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు.. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉండడం గమనార్హం.
This post was last modified on November 5, 2020 10:25 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…