తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పార్టీ పెట్టిన తొలిసారి నిర్వహిస్తున్న మహానాడుకు.. చాలానే ప్రత్యేకతలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రధానంగా సాధారణ స్తాయి కాకుండా.. ఈ దఫా అసాధారణ స్థాయిలో మహానాడును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనిలో 3 రకాల ప్రత్యేకతలు ఉంటాయ న్నారు.
1) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించడం: ఈ విధానంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావును ఏఐ ద్వారా సభకు ఆహ్వానిస్తారు. తద్వారా ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి.. మహానాడు ప్రాంగణంలో కూర్చున్న అనుభూతిని కలిగిస్తారు. అంతేకాదు.. మహానాడును ఉద్దేశించి అన్నగారు ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
2) చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్‌ను మూడు రోజులు మూడు భాగాలుగా ప్రదర్శించడం: ఇది పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సీనియర్ నాయకులు చెబుతున్నారు. పార్టీ కోసం చంద్రబాబు తొలినాళ్లలో మలినాళ్లలో ఎలా కష్టపడ్డారో.. షార్ట్ ఫిల్మ్‌ల ఆధారంగా ప్రదర్శస్తారు. తద్వారా.. పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు.
3) ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం: ఇప్పటి వరకు డిజిటల్ టీడీపీని అంటే ఐటీడీపీని మాత్రమే పరిచయం చేశారు. ఇక, నుంచి ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన కీలక కార్యక్రమాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఏఐతో నాయకుల పనితీరు, కార్యకర్తల పనితీరును అంచనా వేస్తారు. ఇది సమగ్రంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయనుందని చెబుతున్నారు.
This post was last modified on May 5, 2025 6:27 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…