ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. సహజంగా చంద్రబాబు.. లేదా.. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అమరావ తిలో కూర్చుని తాజాగా ప్రధాని ప్రారంభించిన పనులను ప్రారంభించేయొచ్చు. ఎందుకంటే.. అమరావతి పనులు ఇప్పుడు కొత్తగా చేపడుతున్నవి కాదు. కాబట్టి.. వారు ఇంతకన్నా అట్టహాసంగా సభ నిర్వహించి.. పెద్ద ఎత్తున కార్యక్రమాలను పూర్తి చేయొచ్చు.
కానీ, జాతీయస్థాయిలో రాజధాని కార్యక్రమాల ప్రారంభం కానీ.. రాజధాని విశిష్టత కానీ.. ప్రొజెక్టు అవుతుందా? అంటే.. అది అత్యంత స్వల్పంగానే ఉంటుంది. రాష్ట్ర మీడియా ప్రొజెక్టు చేసినంతగా.. జాతీయ మీడియా ప్రొజెక్టు చేయదు. అదే ప్రధాని ద్వారా అయితే.. ఆ స్టయిలే వేరు..ఆ ప్రొజెక్షనే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. చాలా మంది చంద్రబాబు.. మళ్లీ ప్రధానిని పిలుస్తున్నారని తెలియగానే విమర్శలు రువ్వారు. ఇప్పుడు ఎందుకు.. గతంలో నే ఆయన ప్రారంభించారు కదా! అని పెదవి విరుపులు కనిపించాయి.
ఇక, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల అయితే.. పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. అయినా.. చంద్రబాబు వీటిని పట్టించుకోకుండా ప్రధాని రాకకు ప్రాధాన్యం ఇచ్చారు. రెండు నుంచి మూడు సార్లు… ప్రత్యేకంగా ఈ పనిమీదనే ఢిల్లీకి వెళ్లి.. ప్రధానిని ఆహ్వానించారు. తద్వారా.. ఆయన ఓ యజ్ఞం పూర్తి చేశారు. దీని తాలూకు ఫలితం.. శనివారం నాటి జాతీయ మీడియా పతాక శీర్షికల్లో అమరావతిని ప్రొజెక్టు చేసింది. ప్రధాని ప్రారంభించిన పనులతో పాటు.. రాజధాని ప్రాముఖ్యతను కూడా విసదీకరిస్తూ.. స్టోరీలు చేసింది.
చంద్రబాబు కోరుకున్నది ఇదే. కేవలం రాష్ట్రంలోనే చర్చ పెట్డడం కాదు.. జాతీయస్థాయిలో రాజధాని పై చర్చ వస్తే.. అది తనకు మాత్రమే కాకుండా పెట్టుబడులు వచ్చేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి పేరు వచ్చేందుకు అవకాశం ఉంటుందని యోచించారు. పట్టు సడలకుండా.. ప్రధానిని ఒప్పించారు. సహజంగా రెండోసారి ఇలా ప్రారంభించేందుకు మోడీ ఇష్టపడకపోయినా.. ఆయనను ఒప్పించారు. తద్వారా.. చంద్రబాబు అమరావతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లడంలోను…చర్చ సాగేలా చేయడంలోనూ.. సంపూర్ణంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
This post was last modified on May 3, 2025 4:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…