దేవతా భూమిగా.. అజరామరమైన దేవేంద్రుడి రాజధానిగా ప్రధాన మంత్రి అభివర్ణించిన అమరావతి రాజధాని సాకారం కావాలనేది యావత్ తెలుగు ప్రజల ఆకాంక్ష. సీఎం చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు.. అందరూ కోరుకునేది కూడా ఇదే. అయితే.. ఇక్కడ కీలకమైన అంశాలు ఉన్నాయి. చెప్పుకొన్నంత ఈజీ.. రాసుకున్నంత తేలిక అయితే.. రాజధాని నిర్మాణంలో అడుగులు పడడం కుదరవు. దీనికి ఎంతో సంకల్ప దీక్ష. కలిసి వచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.
వీటితో పాటు ఐదు ప్రధాన అంశాలపై సీఎం చంద్రబాబు దృష్టి పెడితే.. రాజధాని సాకారం సాధ్యమేనని అంటున్నారు మేధావులు. వీటిని ఆలంబనగా చేసుకుని అడుగులు వేస్తే.. వడివడిగా ముందుకు సాగడం తోపాటు.. రాజధాని సాకారంలో మైలురాయిని చేరుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మేధావులు ప్రస్థావిస్తున్న ప్రధాన అంశాలు ఇవీ..
1) నిర్దేశిత సమయ నిర్వహణ: ప్రస్తుతం రాజధాని పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక సమయం ప్రకారం పనులు కావడం లేదు. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిజానికి మార్చి తొలి వారంలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడిప్పుడే టెండర్ల దశకు చేరుకున్నారు. ఇలా చేయడం వల్ల.. ఏదో జిమ్మిక్కులు చేస్తున్నారన్న ప్రచారానికి కావాలని బలం చేకూర్చుతున్నట్టే అవుతుంది. దీనిని పరిహరించాలి.
2) సమన్వయం-సహకారం: ప్రస్తుతం రాజధాని పనులను మంత్రి నారాయణ ఒక్కరే భుజాన వేసుకున్న రు. అలా కాకుండా.. ఇతర నాయకులను కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం ద్వారా.. పనులు వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది. పర్యవేక్షణ కూడా పెరుగుతుంది. ఆదిశగా కసరత్తు చేయాలి.
3) సొమ్ముల సాకారం: ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి 15 వేల కోట్ల రుణాలు తీసుకుంటున్నా రు. ఇవి విడతల వారీగా నిర్దేశిత పనులకు మాత్రమే అందుతాయి. పైకి ఎన్ని చెప్పినా ఇది వాస్తవం. అలా కాకుండా.. రాష్ట్రప్రజలపై గతంలో అమరావతి సెస్సును విధించిన సొమ్ములు.. ఇటుకల పేరుతో తీసుకున్న సొమ్ములు సేకరించాలి. అంతేకాదు.. వేడిలో వేడి.. మరోసారి అమరావతి సెస్సును తెరమీదికి తీసుకురావడం ద్వారా వచ్చే ఏడాదిలో నెలకు 10 కోట్ల చొప్పున వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది.
4) కేంద్ర సహకారం: కేంద్రం నుంచి సాధ్యమైనంత వేగంగా సహకారం అందేలా పర్యవేక్షణ సాగాల్సిన అవసరం ఉంది. గత 2014-19 మధ్య ఇది లోపించింది. అయితే.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. దీనిని కూడా పరిహరించాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు భూములు.. నిర్మాణాల వివరాలను పారదర్శకంగా అందించడం ద్వారా.. సాయం తెచ్చుకోవచ్చు.
5) స్థానిక పాలన: అమరావతి రాజధాని సాకారం కావాలంటే.. స్థానికంగానే పాలన సాగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జీఏడీ భవనాలు విజయవాడలో ఉన్నాయి. సెక్రటేరియట్ అమరావతిలో ఉంది. సీఎం ఉండవల్లిలో ఉన్నారు.. ఇలా కాకుండా.. కొన్నాళ్ల పాటు అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభిస్తే.. ప్రజల రాకపోకలు పెరుగుతాయి. పెట్టుబడులు కూడా దక్కుతాయి. ఈ ఐదు సూత్రాలు పాటిస్తే.. అమరావతి సాకారం.. అనుకున్న టైంలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 3, 2025 2:40 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…