పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. నాయకుల్లో మార్పు వస్తుంది. అప్పటి వరకు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే దర్పం, అధికారం వంటివి సహజంగానే నాయకులను పెద్దలను చేస్తాయి. దీంతోవారిలో చాలా మార్పు వచ్చేస్తుంది. కానీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రంతో ముందుకు సాగుతున్నా రు.. టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు. గత ఎన్నికల్లో విజయం నగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న అప్పలనాయుడు.. తన కంటూ ఓ ప్రత్యేకతను సంతరిం చుకున్నారు.
ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రభుత్వం కారు ఏర్పాటు చేసినా.. చాలా సార్లు.. ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి పార్లమెంటుకు సైకిల్‌పైనే వెళ్లిన విషయం తెలిసిందే. ఇదేదో ఒక్కసారికి కాదు.. ఫొటోలు.. వీడియోల కోసం కాదు. పక్కాగా తన సింప్లిసిటీని వ్యక్తం చేసేందుకు కలిశెట్టి అనేక సందర్భాల్లో సైకిల్ పై వచ్చి.. పార్లమెంటుకు వెళ్లారు. ఆయన తన విధేయతను సొంత నియోజకవర్గంలోనూ చూపిస్తున్నారు. ప్రజలను కలుసుకునేందుకు అప్పల నాయకుడు వెళ్లాల్సి వస్తె సైకిల్‌పైనే వెళ్తున్నారు.
తాజాగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అయివుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు సభ్యుడి హోదాకు తోడు టీడీపీకి విధేయుడైన నాయకుడిగా, కార్యకర్తగా, సీఎం చంద్రబాబు కు అత్యంత ఆప్తుడైన కలిశెట్టి అప్పల నాయుడు కూడా.. వచ్చారు. అయితే, ఆయన అందరిలా కార్లలోనో.. ఇతర ప్రభుత్వ వాహనాల్లోనో రావొచ్చు. కానీ.. అలా రాకుండా గతంలో మాదిరిగా తన సొంత సైకిల్ పై 20 కిలో మీటర్ల మేర తొక్కుకుంటూ.. రాజధాని సభకు హాజరయ్యారు. ఈ పరిణామం .. టీడీపీ నే కాదు. ఇతర పార్టీల నాయకులను కూడా ముగ్ధులను చేయడం విశేషం.
This post was last modified on May 2, 2025 5:45 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…