వైసీపీలో ఏం జరుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవరి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవరో కాదు.. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్నవారే చెబుతున్న మాట. ఈ క్రమంలో ఎవరినీ తిట్టొద్దని.. తిడితే.. వారు వెళ్లిపోతారని.. కీలక సలహాదారు జగన్‌కు సూచించారు. ఇది బహిరంగ రహస్యమే. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వరుసగా భేటీ లు నిర్వహిస్తున్న అధినేత.. జిల్లాల్లో నాయకుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.
ముందుగానే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాల్లో బాధ్యతలు అప్పగించిన ఇంచార్జ్లు.. చాలా మంది నిద్ర మొహాలతో వ్యవహరిస్తున్నారని.. ఆయన పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు, కృష్ణాజిల్లాల్లో పార్టీ పరిస్థితి పేలవంగా ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టించుకుంటే తప్ప.. ఎవరూ ముందుకు రారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
దీంతో పార్టీ సమావేశాల్లో ఒకింత సీరియస్ నెస్ పెంచారు. ఆది నుంచి కూడా బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యం లేని వైసీపీ నుంచి అనేక మంది నాయకులు బయటకు వచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగుతోంది. దీనిని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. పోనీ.. వెళ్లాలంటే అవకాశాలు లేవు. అయితే.. అవకాశాలు లేకపోయినా.. వెళ్లిపోయేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎలానూ ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి.. ఓ మూడేళ్లు వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకోవాలని రెడీ అవుతున్నారు.
దీనిని పసిగట్టిన ఓ కీలక సలహాదారు.. జగన్‌కు ఓ సలహా పడేశారు. ఎవరినీ తిట్టొద్దు సార్.. తిడితే వెళ్లిపోతారు.. అప్పుడు పూర్తిగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. అని ఆయన హితవు పలికారు. అయితే.. జగన్ మాత్రం వినే టైపు కాదకదా.. ఈ క్రమంలోనే పశ్చి మ ఇంచార్జ్ ప్రసాదరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఆయన ఇప్పటికే తట్టా బుట్టా సర్దుకున్నారని సమాచారం. ఇప్పుడు జగన్ ఆయనపై విమర్శలు చేయడంతో ఆయన జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
This post was last modified on May 2, 2025 11:41 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…