Political News

ప్రైవేట్ రిసార్టులో గ్రూప్ 1 మూల్యాంకనమా..?

గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులను నియమించేందుకు నిర్వహించే పరీక్ష. దేశంలోనే అత్యున్నత స్థాయి అయిన సివిల్ సర్వీసెస్ తర్వాత స్థాయి సర్వీసు ఉద్యోగులు వీరే. వీరే ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అధికారులుగా ప్రమోట్ అవుతారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం (వాల్యూయేషన్) ఎంత పకడ్బందీగా జరగాలి.

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉద్యోగార్థులకు ఎలాంటి అనుమానాలు రేకెత్తని రీతిలో ఈ వాల్యూయేషన్ ను చేపట్టాలి. అయితే సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటి… ఆ తర్వాత ఐపీఎస్ అధికారిగా మంచి ట్రాక్ రికార్డు కలిగి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా వ్యవస్థలపైనే అనుమానా రేకెత్తేలా ఆయన నడుచుకున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో విడుదలైన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన మెయిన్స్ ను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఆ సమయంలో కమిషన్ కు చైర్మన్ లేకపోగా… కార్యదర్శి హోడాలో పీఎస్ఆర్ అన్నీతానై వ్యవహరించారు. పరీక్షల నిర్వహణ నుంచి వాల్యూయేషన్ దాకా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ మేరకు ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులే పీఎస్ఆర్ అక్రమాలను , ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.

ఈ వివరాలన్నీ ఇప్పుడు హైకోర్టుకు చేరడంతో పీఎస్ఆర్ మరింత మేర చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన గ్రూప్ 1 జవాబు పత్రాల వాల్యూయేషన్ ను పీఎస్ఆర్ ఏకంగా ఓ ప్రైవేటు రిసార్టులో నిర్వహించడం గమనార్హం.

ఏపీపీఎస్సీ ఓ చట్టబద్ధ సంస్థ. రిసార్టు అనేది డబ్బున్న వాళ్లు చిందులేసి సేదదీరేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ విడిది. ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పీఎస్ఆర్ చెరిపేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో గట్టి బందోబస్తు మధ్య జరగాల్సిన పేపర్ల వాల్యూయేషన్ ను పీఎస్ఆర్..గుంటూరు జిల్లా పరిధిలోని హాయ్ ల్యాండ్ రిసార్టులో నిర్వహించారు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.1.14 కోట్ల ఏపీపీఎస్సీ నిధులను చెల్లించారు. పోనీ… ఈ వాల్యూయేషన్ తోనే సరిపెట్టారా? అంటే… అదీ లేదు.

ఈ వాల్యూయేషన్ ను పక్కనపెట్టేసిన పీఎస్ఆర్ మరోమారు ఆ పత్రాలను దిద్దించారు. అయినా ప్రైవేటు రిసార్టుగా ఉన్న హాయ్ ల్యాండ్ రిసార్టులో గ్రూప్ 1 జవాబు పత్రాల వాల్యూయేషన్ ఏమిటంటూ అభ్యర్థులు పీఎస్ఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ పీఎస్ఆర్ చేసిన నిర్వాకాలను ఆధారాలతో సహా వారు హైకోర్టు ముందు ఉంచడం గమనార్హం.

ప్రస్తుతం ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో పీఎస్ఆర్ అరెస్టై విజయవాడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని మేర ఆధారాలను సేకరించే క్రమంలో పీఎస్ఆర్ ను సీఐడీ అదికారులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కస్టడీ విచారణపైనా పీఎస్ఆర్ నేరుగా న్యాయమూర్తికే ఫిర్యాదు చేసి తనదైన మార్కును చాటుకున్నారు.

మొత్తం 3 రోజుల కస్టడీకి పీఎస్ఆర్ ను సీఐడీకి ఇవ్వగా..మొన్న పీఎస్ఆర్ కు హైబీపీ ఉందని వైద్యులు చెప్పడంతో… పీఎస్ఆర్ కు ఏమీ కాకూడదన్న భావనతో సీఐడీ అదుపులోకి తీసుకోలేదు. దీనిపై మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టుకు వెళ్లిన పీఎస్ఆర్… తాను ఫిట్ గా ఉన్నా కూడా సీఐడీ అదికారులు తనను ఓ రోజు విచారించలేదని జడ్జీకి ఫిర్యాదు చేశారట. మొత్తంగా ఏది చేసినా పీఎస్ఆర్ తన వింత ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారన్నమాట.

This post was last modified on April 30, 2025 2:07 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

6 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

6 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago