ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. గతంలో మాదిరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఏ రీతిన అయితే సత్తా చాటిందో… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చోటుచేసుకున్న ఈ మార్పును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా అందిపుచ్చుకున్నారనే చెప్పాలి. అంతేనా… అందరి కంటే కూడా ఈ విషయంలో చంద్రబాబే ముందు వరుసలో ఉన్నారని కూడా చెప్పాలి. నూతనంగా ఆవిష్కృతం అవుతున్న రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ ఆధారిత సాంకేతికత, డేటా అనలైటిక్స్. ఏఐ సెంట్రిక్ ఆక్యూరసీలను కూడా అందిపుచ్చుకునే దిశగా చంద్రబాబు సాగుతున్నారు.
సోమవారం అమరావతి పరిధిలోని వేలూరు ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (విట్ ఏపీ)లో నూతనంగా ఏర్పాటైన భవనాలను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతితో పాటుగా విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విశాఖకు త్వరలోనే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ రాబోతోందని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేస్తామన్న చంద్రబాబు… గూగుల్ విశాఖలో అడుగుపెడితే… జరిగే పరిణామాలను ఆయన అలా చూచాయగా వెల్లడించారు. డేటా ఎనలైటిక్స్ లో ప్రపంచానికే విశాఖ కేంద్రంగా మారబోతోందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఏఐ అక్యూరసీతో ఈ డేటా ఎనలైటిక్స్ ఉండబోతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇదేదో ఇప్పుడే మొదలైన పరిణామం కానే కాదని చెప్పాలి. భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చినంతనే గుర్తించారు. ఆ వెంటనే ఆయన ఏఐపైనా, ఏఐ ఆధారిత కంపెనీలను ఏపీకి రాబట్టే దిశగా ఇదివరకే కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని కూడా చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నామధ్య అమెరికా పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్… గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్, టెస్లా, అబోడ్ వంటి కీలక సంస్థల కార్యాలయాలను సందర్శించారు. తమ డేటా సెంటర్లను ఏపీలో ప్రత్యేకించి విశాఖలో ఏర్పాటు చేయడానికి గల అనుకూలతలు, అవకాశాలను ఆయన ఆయా కంపెనీలకు వివరించారు. ఆయా కంపెనీల్లో ఏపీ పట్ల ఆసక్తిని కూడా పెంచి తిరిగి వచ్చారు.
ఆ తర్వాత ఆయా కంపెనీలతో కూటమి సర్కారు నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అందులో భాగంగా గూగుల్ ప్రతినిధి బృందం ఇటీవలే ఏపీలో పర్యటించింది. విశాఖతో పాటు అమరావతిని ఆ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. తమ కంపెనీ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లకు విశాఖ అనుకూలంగా ఉన్నట్లుగా కూడా వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ నుంచి తాజాగా ప్రభుత్వానికి ఓ మంచి వార్త అందినట్టుగా సమాచారం. ఈ వార్తను బేస్ చేసుకునే చంద్రబాబు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. బాబు చెప్పినట్టుగా గూగుల్ విశాఖలో అడుగుపెడితే… ఇతర కంపెనీలు కూడా విశాఖకు క్యూ కట్టడం ఖాయమని… వెరసి డేలా ఎనలైటిక్స్ కు విశాఖ కేంద్రంగా మారనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 28, 2025 4:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…