వైసీపీ హయాంలో తప్పులు చేశారని.. అవినీతికి పాల్పడ్డారని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ అధికారులను కూటమిసర్కారు విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరిపై కీలక నిర్ణయాలు తీసుకుని జైళ్లకు కూడా పంపిస్తోంది. ఇటీవల గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమా నిని మాజీ మంత్రి విడదల రజనీ బెదిరించి.. రూ.2.2 కోట్ల రూపాయలను గుంజిన వ్యవహారంలో ఐపీఎస్ అదికారి పల్లె జాషువాను విచారించిన విషయం తెలిసిందే. దీనిపై మరింత కూపీ లాగుతున్నారు.
ఇక, ముంబైకి చెందిన.. నటి జెత్వానీని అన్యాయంగా ఏపీకి తీసుకువచ్చి.. విజయవాడలో నిర్బంధించి.. ఆమెను, ఆమె కుటుంబాన్ని వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్.. సీతారామాంజ నేయులును కూడా.. పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. జైలుకు తరలించడం తెలిసిందే. ఇలా.. అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన ఐపీఎస్‌ల ను కూటమి సర్కారు తనదైన శైలిలో విచారిస్తంది. ఇక, ఈ పరంపరలో మరో పేరు తెరమీదికి వచ్చింది.
అదే.. గౌతం సవాంగ్. వైసీపీ హయాంలో ఏపీడీజీపీగా పనిచేసిన గౌతం సవాంగ్.. అనేక ఆరోపణలు ఎదు ర్కొన్నారు. ముఖ్యంగా డీజీపీగా ఉన్న సమయంలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగినప్పుడు.. టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకులు దాడులు చేసినప్పుడు ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాళ్ల దాడిని ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన కింద చూడాలని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చెబుతున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన.. మాజీ మంత్రి జోగి రమేష్ ఉదంతాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నారు.
మరీ ముఖ్యంగా విశాఖలో మత్తు వైద్య నిపుణుడు.. డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు ప్రదర్శించిన దాష్టీకం పై కూడా.. అప్పటి డీజీపీగా సవాంగ్ ఖండించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. కట్ చేస్తే.. ఈ విషయాలు ఎలా ఉన్నా.. తాజాగా.. ఏపీపీ ఎస్సీలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను .. అవినీతిని ప్రభుత్వం వెలికి తీస్తోంది. డీజీపీగా ఉన్న సవాంగ్‌ను అనూహ్యంగా జగన్.. ఏపీపీఎస్సీ చైర్మన్‌ను చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్ష సహా.. నియామకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టు కూడా.. వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ విషయాలపై కూడా.. సర్కారు దృష్టి పెట్టింది. మొత్తంగా.. ఇప్పుడు గౌతం సవాంగ్ వంతు వచ్చిందని.. పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం గౌతం సవాంగ్ తన సొంత రాష్ట్రంలో అస్సాంలో ఉంటున్నారు.
This post was last modified on April 26, 2025 3:02 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…