ఏపీలో పెను కలకలమే రేపుతున్నమద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. శనివారం సాయంత్రానికి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కసిరెడ్డి తోడల్లుడు చాణక్య ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే… ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు కాదు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని తొండూరు మండలం తుమ్మలపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డికి రామకృష్ణారెడ్డితో చుట్టరికం ఉన్నా.. అంత దగ్గర బంధువు కాదు. నంద్యాల నుంచి ఓ దఫా ఎంపీగా కొనసాగిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్న శ్రీధర్ రెడ్డి… నంద్యాల కేంద్రంగా వ్యాపారం గానీ, రాజకీయం గానీ చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేత అయిన శ్రీధర్ రెడ్డి… వైసీపీ అదినేత జగన్ తో ఒకింత చనువుగానే సాగుతున్నారు.
ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత పులివెందులను వీడి తన మకాంను నంద్యాలకు మార్చేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి… మామ గారి వ్యాపారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా తన సతీమణి సుజలతో కలిసి ఎస్పీవై రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కూడా తీసుకున్నారు. 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన శ్రీధర్ రెడ్డి.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేనలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. ఇక 2019లో జగన్ అధికారంలోకి రావడంతోనే జనసేనను వీడి జగన్ పంచన చేశారు. పులివెందుల నేటివిటీ, ఇంటిపేరు సజ్జలను చూపిన ఆయన అనతి కాలంలోనే జగన్ కోటరీలోకి ఈజీగానే చేరగలిగారు.
ఇక జగన్ జమానాలో జే బ్రాండ్లుగా ముద్ర పడిన మద్యం బ్రాండ్లన్నీ కూడా నంద్యాల పరిధిలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రంగానే తయారయ్యాయి. ఆయా కంపెనీలకు చెందిన బ్రాండ్ల మద్యాన్ని సేకరించిన లిక్కర్ ముఠా సభ్యులు… దానిని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లోనే తనదైన ప్రమాణాల మేరకు నాణ్యతను మార్చివేసింది. వెరసి.. మద్యం కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కీలక కేంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా మద్యం పాలసీ రూపకల్పన, ఆయా బ్రాండ్ల ఎంపిక, ఆయా కంపెనీల నుంచి ముడుపుల ఖరారు, వాటి స్వీకరణ, వాటిని గమ్యస్థానం చేర్చడం వంటి కార్యకలాపాలు అన్నింటిలోనూ శ్రీధర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. వెరసి రాజ్ కసిరెడ్డికి ఈ దందాలో ఏ మేర పాత్ర ఉందో… శ్రీధర్ రెడ్డికి కూడా అంతే పాత్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 26, 2025 10:59 am
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…
ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…