అత్యుత్సాహంలో ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ నుండి తెరిచిన స్కూళ్ళ కారణంగా కరోనా వైరస్ వ్యాపిస్తోందా ? క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ళు తెరిచిన విషయం అందరికీ తెలిసిందే. మొదటిరోజు సోమవారం స్కూళ్ళు తెరవగానే కొందరు టీచర్లు, విద్యార్ధుల్లో కరోనా వైరస్ బయటపడింది. ఒక్క చిత్తూరు జిల్లాలోని టీచర్లలో సుమారు 70 మందికి కరోనా వైరస్ బయటపడింది. అలాగే విద్యార్ధుల్లో కూడా వైరస్ ఉన్న విషయం బయటపడటంతో వాళ్ళని వెంటనే ఇళ్ళకు పంపేశారు.
నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని స్కూళ్ళల్లోని కొందరు టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. టీచర్లు, విద్యార్ధులు స్కూళ్ళల్లోకి ప్రవేశించే మందే అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ లో వారందరికీ కరోనా లక్షణాలున్న విషయం బయటపడుతోంది. అంటే వీళ్ళకు కూడా తమకు కరోనా వైరస్ ఉన్న విషయం తెలియదని అర్ధమవుతోంది. టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్న విషయం బయటపడగానే నెల్లూరులోని ఓ స్కూలును తెరవకుండానే వెళ్ళిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్లు, టీచర్లు కరోనా వైరస్ నేపధ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది వాస్తవం. స్కూల్ ఎంట్రన్స్ లోనే అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. తరగతి గదుల్లో శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికే కరోనా వైరస్ ఉన్న టీచర్లు, విద్యార్ధులు స్కూల్లోకి వచ్చేస్తే ఏమి చేస్తారు ? అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఈ భయంతోనే తల్లి, దండ్రులు తమ పిల్లలను కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకు పంపలేదని సమాచారం. 9, 10 తరగతుల విద్యార్ధులకు రోజు మార్చి రోజు స్కూలుకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించినా ఆచరణ సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
నిజానికి ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా స్కూళ్ళు తెరవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమి కనిపించిందో అర్ధం కావటం లేదు. ఇప్పటికే విద్యాసంవత్సరం పోయింది. ఒక్క విద్యాసంవత్సరమే కాదు ఆర్ధికసవత్సరం కూడా పోయింది. అయితే ప్రభుత్వం గ్రహించాల్సిందేమంటే విద్యాసంవత్సరం పోవటం అన్నది ఒక్క ఏపికే కాదు. దేశమంతా ప్రపంచమంతా కూడా ఇదే సమస్య. విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే ప్రాణాలు ఎంతో విలువైన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ కారణంగానే మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో ఏకంగా విద్యా సంవత్సరాన్ని రద్దు చేశాయి. మరికొన్ని విద్యాసంస్ధలు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ మొదలవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది.
This post was last modified on November 3, 2020 10:42 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…