గత ఏడాది కూటమి విజయం దక్కించుకున్నాక.. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత.. ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బోర్డులు వెలిశాయి. బ్యానర్లు కూడా.. భారీ ఎత్తున కనిపించాయి. వాహనాలకు సైలెన్సర్లు తీసేసి.. యాగీ చేసిన యువత కూడా పేట్రేగారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అప్పట్లో అధికారులు.. పోలీసులు వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి. ఫలితంగా ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ మనుషులు రెచ్చిపోయారు.
అయితే.. నేరుగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకున్న పవన్ కల్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. అని రాసి ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఆ తర్వాత.. ఇలాంటి వాటికి అడ్డు కట్ట పడింది. ఇప్పుడు ఎక్కడా పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా..అనే బోర్డులు కానీ.. బ్యానర్లు కానీ… కనిపించకుండా పోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు “చంద్రబాబు గారి తాలూకా!” అంటూ.. క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది. నేరుగా చంద్రబాబు పేరునే చెబుతున్న కార్యకర్తలు.. భారీ స్థాయిలో అక్రమాలకు తెరదీస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు.. నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మట్టి కొండలను(గ్రావెల్) కరిగించేసిన ఓ కాంట్రాక్టర్(టీడీపీకి అనుబంధ నాయకుడుగా గుర్తింపు ఉంది) సదరు మట్టిని ఎక్కడకు తరలిస్తున్నావని ప్రశ్నించిన అధికారులకు.. “అమరావతిలో చంద్రబాబు గారు..ఇల్లు కడుతున్నారు కదా.. అక్కడికి” అని గడుసు సమాధానం ఇచ్చాడు. ఇలా రోజులు వారాలు కూడా గడిచిపోయాయి. అయితే..దీనిపై అనుమానం వచ్చిన..కొందరు అసలు విషయాలను రాబట్టారు. చంద్రబాబు ఇంటికి-కాంట్రాక్టర్ తోలకాలకు సంబంధం లేదని వారే నిరూపించారు.
ఇక, ఇప్పుడు తాజాగా.. కుప్పంలోను, గుడివాడలోనూ కూడా ఇలాంటి ఘటనలే వెలుగు చూశాయి. అక్ర మంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను పట్టుకున్న పోలీసులు.. వాటిని కుప్పంలోనిచంద్రబాబు ఇంటికి పంపిస్తున్నామని.. చెప్పడంతో వదిలేశారు. కానీ, వాస్తవానికి కుప్పంలో నిర్మిస్తున్న ఇంటికి.. గ్రానైట్ పనులు అయిపోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో అవాక్కయిన పోలీసులు… లారీలు.. పొరుగు రాష్ట్రానికి చేరిపోయాయని గ్రహించి.. అక్కడకు పరుగులు పెట్టారు. కానీ, అక్కడ కూడా.. ఆచూకీ లభించలేదు.
ఇక, గుడివాడలో కూడా.. మట్టి అక్రమాలకు..చంద్రబాబు పేరును వినియోగించేస్తున్నారు. గుడివాడలోని రావి కమతం ప్రాంతంలో ఉన్న కొండలను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అయితే.. ఈయన లీజు అయిపోయి… వారం అయింది. కానీ.. మట్టిని తరలించస్తూ.. ఏకంగా ట్రక్కులపై చంద్రబాబు గారి తాలూకా అని బోర్డులు పెట్టేసేయడంతో అధికారులు మిన్నకున్నారు. కానీ.. దీనిపై స్థానికులు ఉప్పందించడంతో రెవెన్యూ అధికారులు ఆరాతీసి.. ఆగడాలకు చెక్ పెట్టాలనినిర్ణయించారు. ఇలా.. అప్పట్లో పవన్ కల్యాణ్‌పేరును.. ఇప్పుడు చంద్రబాబు పేరును వాడేసుకుంటున్న తీరుతో వారికి చెడ్డపేరు వస్తుండడం గమనార్హం.
This post was last modified on April 24, 2025 9:50 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించిన సంగతి…
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…
35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…
కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…