Political News

‘వైసీపీ మ‌త్తు’ వ‌దిలిస్తున్న‌ సిట్‌.. 4 రోజుల్లో నివేదిక‌!

ఏపీలో వైసీపీ హ‌యంలో జ‌రిగిన మ‌ద్యం కొనుగోళ్లు.. విక్ర‌యాల ద్వారా సుమారు రూ.2 – 3 వేల కోట్ల వ‌ర‌కు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని..దీనిలో స‌గానికిపైగానే ‘కీల‌క నేత‌’ ఖాతాలోకి చేరాయ‌ని భావిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యా ప్తు బృందం ఆ దిశ‌గా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో త‌వ్వుతున్న కొద్దీ కొత్త విష‌యాలు.. కొత్త మ‌నుషులు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాస్త‌వానికి వైసీపీ సీనియ‌ర్ నేత‌ వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు విక్రాంత్ రెడ్డితో మొద‌లైన వ్య‌వ‌హారం రాజ్ క‌సిరెడ్డి వ‌ద్ద ఆగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ.. రాజ్ క‌సిరెడ్డిని విచారించిన త‌ర్వాత‌.. మ‌రో ముఖ్య వ్య‌క్తి బూనేటి చాణ‌క్య అలియాస్ ప్ర‌కాష్ ఈ వ్య‌వ‌హారంలో రాజ్ క‌సిరెడ్డి చెప్పిన‌ట్టు న‌డుచుకున్నార‌ని తేలింది. మ‌ద్యం విక్ర‌యాలు.. నుంచి.. లాభాల పోగు చేసుకోవ‌డం వ‌ర‌కుకూడా.. చాణ‌క్య కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు గుర్తించారు. ఆ వెంట‌నే అత‌నిపై రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన‌ త‌ర్వాత‌..దుబాయ్‌కు పారిపోయిన చాణ‌క్య తాజాగా ఇండియాకు తిరిగి రావ‌డంతో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో దాదాపు మ‌ద్యం మ‌త్తు ప‌ట్టిన వైసీపీ వ్య‌వ‌హారంలో కీల‌క ముంద‌డుగు ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాష్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఏయే డిస్టిల‌రీకి ఎంత టార్గెట్ పెట్టాలి? ఏయే డిస్ట‌ల‌రీ నుంచి ఎంత మొత్తం పిండేయాల‌న్న‌ది ఆయ‌నే నిర్ణ‌యించార‌ని అధికారులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే రాజ్ క‌సిరెడ్డి నుంచి కొంత స‌మాచారం రాబ‌ట్టిన సిట్ ద‌ర్యాప్తు బృందం… చాణక్య‌ను విచారించ‌డం ద్వారా.. కింగ్ పిన్‌కు ఉచ్చు బిగిస్తోంది. మ‌రోనాలుగు రోజుల్లో దాదాపు ద‌ర్యాప్తు కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

సాధ్య‌మేనా?

ఇక‌, మ‌ద్యం విష‌యంలో వైసీపీ కీల‌క నేత‌కు.. ముడుపులు త‌ర‌లి పోయాయ‌ని భావిస్తున్న అధికారులు.. ఈ నిధుల‌ను స్వాధీనం చేసుకోవ‌డం సాధ్య‌మేనా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. విదేశాల‌కు త‌ర‌లించిన నిధుల‌ను తీసుకురావ‌డం.. ఏయే దేశాల‌కు ఎంతెంత మొత్తం త‌రలిపోయింద‌న్న విష‌యాల‌ను కూపీలాగ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌ద‌రు నిధుల‌ను వెన‌క్కితీసుకురావాలంటే.. కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం త‌ప్ప‌ని స‌రి.. అని భావిస్తున్నారు.

మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారాల విష‌యంలో కేంద్రం ఏపీకి స‌హ‌క‌క‌రిస్తే త‌ప్ప‌.. ఈ నిధుల‌ను తిరిగి తీసుకురావ‌డం అంత ఈజీకాద‌ని అధికారులు భావిస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో విచార‌ణను ముగించి ప్ర‌భుత్వానికి సిట్ నివేదిక అందించిన‌త‌ర్వాత‌..దీనిపై స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యం..కేంద్రం స్పందించే తీరు.. కీల‌కంగా మార‌నున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 24, 2025 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

19 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago