Political News

పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపరచగా 14 రోజులపాటు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆంజనేయులును విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.ఈ కేసులో మంగళవారం నాడు ఆంజనేయులును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వ పెద్దల అండదండలతో అధికార దుర్వియోగానికి ఆంజనేయులు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పక్క ప్రణాళికతోనే జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారని తెలుస్తోంది. దాని వెనుక ఆంజనేయులు ఆదేశాలు ఉన్నాయని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంజనేయులుతో పాటు అప్పటి విజయవాడ సిపి కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నీల మధ్య ఫోన్ కాల్ సంభాషణలు సిఐడి అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది.

జత్వాని నివాసం ఉండే ప్రాంతంలో ముంబై పోలీసులతో ఆంజనేయులు మాట్లాడిన కాల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారని తెలుస్తోంది. అంతేకాకుండా జత్వానిపై వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు కూడా నకిలీఛని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆ భూ లావాదేవీలకు జత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఇక ఈ కేసు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ విశాఖపట్నం డిసిపిగా బదిలీ అయిన విశాల్ ను సీఎంవోకు పిలిపించి ఆంజనేయులు ఒత్తిడి చేశారని తెలుస్తోంది. 

జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి తెచ్చిన తర్వాతే విశాఖకు రిలీవ్ చేస్తామని, లేదంటే విజయవాడలో ఉండాల్సి వస్తుందని ఆంజనేయులు స్పష్టం చేసినట్లుగా విశాల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులను ముంబై నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో బలవంతంగా తీసుకురావడం, బలవంతంగా నిర్బంధించడం, ముంబైలో ఆమె పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని బెదిరించడం వంటి చర్యలు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాయని తమ రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.

అయితే , ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆ విషయం ఏమిటో చూడాలని మాత్రమే తాను చెప్పానని , అంతకుమించి ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆంజనేయులు కోర్టులో స్వయంగా వాదించారట.

This post was last modified on April 23, 2025 3:24 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

13 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

53 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago