Political News

ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి నిందితుడిగా

ఏపీలో మంగళవారం ఉయదం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు(పీఎస్ఆర్ ఆంజనేయులు) అరెస్టు అయ్యారు. ఏపీ పోలీసులు మంగళవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట పరిధిలోని పీఎస్ఆర్ ఇంటిలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. మంగళవారం సాయంత్రానికి గానీ పీఎస్ఆర్ ను విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించిన కేసుల్లో హైదరాబాద్ లో అరెస్టు అయిన నాలుగో వ్యక్తిగా పీఎస్ఆర్ నిలిచారని చెప్పాలి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, ప్రభుత్వ మాజీ సలహాదారు రాజ్ కసిరెడ్డిలు ఏపీకి చెందిన కేసుల్లో హైదరాబాద్ లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు సంబంధించిన కేసులో పీఎస్ఆర్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులోనే పీఎస్ఆర్ ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు. తాజాగా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసే నిమిత్తం ఏపీ పోలీసులు పీఎస్ఆర్ ను ఏకంగా అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఈ కేసులో పీఎస్ఆర్ తో పాటుగా మరో సీనియర్ ఐపీఎస్ కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలు కూడా నిందితులుగా ఉన్నారు. పీఎస్ఆర్ తో పాటు వారిద్దరూ గతంలోనే సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే ఈ కేసులో వారిద్దరూ కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే పీఎస్ఆర్ మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. ఈ కారణంగానే టాటా, గున్నీలను పక్కనపెట్టిన పోలీసులు పీఎస్ఆర్ ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పీఎస్ఆర్ కు పేరుంది. ఈ కారణంగానే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫోకల్ పోస్టుల్లోకి వచ్చిన పీఎస్ఆర్.. అనతి కాలంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఛాన్స్ కొట్టే:శారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో పీఎస్ఆర్.. జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పిన చాలా పనులను చక్కబెట్టారని, అందులో భాగంగానే వైసీపీ పెద్దలు చెప్పంగానే… నిబంధనలను పక్కన పెట్టేసి ముంబై వెళ్లి మరీ జెత్వానీని విజయవాడ తీసుకువచ్చారని ఆయనపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా రోజుల తరబడి తమ కస్టడీలో ఉంచుకున్న జెత్వానీపై వేధింపులకు పాల్పడ్డారని, తాము చెప్పినట్లుగా నడుచుకోవాలనిి, స్టేట్ మెంట్ ఇవ్వాలని ఆమెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారన్న కూడా ముగ్గురు ఐపీఎస్ లపై ఆరోపణలున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే… విజయవాడ వచ్చిన కాదంబరి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు… వైసీపీ మాజీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు పీఎస్ఆర్, టాటా, గున్నీలపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా అప్పటిదాకా కీలక పోస్టుల్లో కొనసాగిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆది నుంచి నా రూటే సెపరేటు అన్నట్లుగా సాగే పీఎస్ఆర్ ఈ కేసును అంత సీరియస్ గా తీసుకోలేదన్న వాదనలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన ముందస్తు బెయిల్ కోసం గానీ, కేసు కొట్టివేయాలని గానీ కోర్టులను ఆశ్రయించలేదు. అయితే కేసు సీరియస్ నెస్ ను గుర్తించిన టాటా, గున్నీలు కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు నుంచి తప్పించుకోగా… పీఎస్ఆర్ మాత్రం అరెస్టు అయ్యారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on April 22, 2025 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago