Political News

నితీష్ లో అసహనం దేనికి సంకేతం ?

బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లో అసహనం పెరిగిపోతోంది. ఎన్డీయే కూటమి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినపుడు నితీష్ ప్రశాంతంగానే ఉండేవారు. తర్వాత్తర్వాత బహుశా టెన్షన్ పెరిగిపోయినట్లుంది. ఎన్నికల వేడి మొదలు కాకముందు ఎన్డీయే కూటమికే మళ్ళీ అధికారం ఖాయమంటూ ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. అయితే ఎన్నికల వేడి పెరిగిపోయి మొదటిదశ పోలింగ్ జరిగేనాటికి బీహార్ లో సీన్ మారిపోయిందనింపించింది.

అసలు ఎన్నికల్లో ప్రత్యర్ధే కాదని అధికార కూటమి భావించిన యూపీఏ కూటమి హెడ్, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్జేడీ చీఫ్ తేజస్వీ బాగా గట్టివాడని అందరికీ అర్ధమైపోయింది. అనుకున్నట్లే మొదటి దశలో జరిగిన పోలింగ్ అంచనాలు కూడా మారిపోయాయి. 71 స్ధానాలకు అక్టోబర్ 28వ తేదీన జరిగిన మొదటి విడత పోలింగ్ లో 30 స్ధానాల్లో యూపీఏకే అత్యధిక సీట్లు వస్తాయనే సర్వే ఫలితాలు తేల్చాయి. అలాగే ఎన్డీయే కూటమికి 19 సీట్లే అని పోస్టు పోల్ సర్వేలో బయటపడటం నితీష్ లో కలవరం పెంచేసింది.

మొదటి విడత పోలింగ్ సమయానికే పోలింగ్ ట్రెండ్స్ నితీష్ కు తెలిసిపోయిందేమో. అందుకనే తేజస్విపై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. మొదటి విడత పోలింగ్ తర్వాత నుండి తేజస్వీ, కాంగ్రెస్ అభ్యర్ధులపై మరీ రెచ్చిపోయి ఆరోపణలు చేసేస్తున్నారు. రేపు 3వ తేదీన రెండోవిడత పోలింగ్ జరగబోతోంది. పరిస్దితిని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా వెంటనే బీహార్ ఎన్నికల ప్రచారానికి దిగిపోయారు. ప్రచారం మొదలుపెట్టడమే ఆర్జేడీ చీఫ్ పై ఆరోపణలు పెంచేశారు.

ఒకవైపు మోడి మరోవైపు నితీష్ అండ్ తేజస్వీని టార్గెట్ చేసుకున్న విషయం అర్ధమైపోతోంది. నిజంగానే ఎన్డీయే కూటమి గెలుపు నల్లేరుపై బండి నడక లాంటిదే అయితే తేజస్వినో లేకపోతే కాంగ్రెస్ అభ్యర్ధులనో ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి గురించి రెగ్యులర్ గా ప్రస్తావిస్తున్నారు. నిజానికి లాలూ అవినీతి గురించి ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే అవినీతి ఆరోపణలపైనే ఇపుడు లాలూ జైలులో ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పదేళ్ళనుండి సిఎంగా ఉంటున్న నితీష్ కూడా పోలింగ్ ప్రచారంలో ఇంత అసహనానికి గురికావటమే ఆశ్చర్యంగా ఉంది. నితీష్, మోడి ప్రచారం చేస్తున్న పద్దతి చూస్తుంటే యూపీఏ కూటమిని ప్రత్యేకంగా తేజస్విని చాలా తక్కువగా అంచనా వేసినట్లు అర్దమైపోతోంది. 90 స్ధానాలకు జరిగే రెండో విడత పోలింగ్ లో కూడా ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యత రాకపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా ? అన్నదే నితీష్ డౌటనుమానం. చూద్దాం ఏం జరుగుతుందో .

This post was last modified on November 2, 2020 3:57 pm

Share

Recent Posts

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

18 minutes ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

34 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

1 hour ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

2 hours ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago