Political News

గుడివాడ‌-గ‌న్న‌వ‌రం.. కేరాఫ్ టీడీపీ!

గుడివాడ‌-గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ.. చ‌ర్చ‌కు వ‌చ్చేవే. బ‌ల‌మైన నాయ‌కులుగా… ఒక‌ప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను శాసించిన.. వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానీలు.. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను క‌ద‌ల‌కుండా మెద‌ల‌కుండా కూడా చేశారు. చిత్రం ఏంటంటే.. ఇద్ద‌రూ కూడా.. టీడీపీలో ఎదిగిన వారే.. టీడీపీ పంచ‌న మొలిచిన వారే. కానీ.. త‌ల్లిపాలు తాగి ఏదో చేసిన‌ట్టుగా.. ఇద్ద‌రూ టీడీపీకి శ‌త్రువులుగా మారారు. పార్టీ అధినేత చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.

అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని అంటారు. అలానే.. గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్తితి తిర‌గ‌బ‌డింది. రెండు చోట్లా ఆ ఇద్ద‌రు నాయ‌కులు ప‌రాజ‌యం పాల‌య్యారు. అంతేకాదు.. వారి అడ్ర‌స్ కూడా లేకుండా పోయింది. ఇంత‌కీ చెప్పొచ్చేదంటంటే.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీ గూళ్లు ఖాళీ అవుతున్నాయి. గుడివాడ‌లో వైసీపీ కార్యాల‌యంగా ఉన్న ప్రాంతాన్ని య‌జ‌మాని తీసుకున్నా రు. దీంతో అక్క‌డ కార్యాల‌యం తీసేశారు.

ప్ర‌స్తుతం కీల‌క‌మైన కార్యాల‌యం తీసేయ‌డంతో ఎవ‌రూ ప్ర‌శ్నించేవారు కూడా లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నారై వెనిగండ్ల రాము విజ‌యం ద‌క్కించుకున్న గుడివాడ‌లో ఇప్పుడు అభివృద్ధి సుమాలు విరుస్తున్నాయ‌ని స్థానికులు సైతం చెప్పుకొంటున్నారు. వ‌ర్గ పోరు లేదు. బెదిరింపులు లేవు. నా-నీ.. అనే బేధాభిప్రాయాలు సైతం లేకుండా.. పనులు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. దీంతో గుడివాడ‌లో వైసీపీ కి చెందిన క్షేత్ర‌స్థాయి నాయ‌కులు కూడా వెనిగండ్ల వైపు మొగ్గు చూపి.. కండువాలు మార్చుకుంటున్నారు.

ఇక‌, గ‌న్న‌వ‌రంలో మాజీ వైసీపీ నాయ‌కుడు, ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ చెంత‌కు వ‌చ్చిన యార్ల‌గ‌డ్డ వెంక ట్రావు కూడా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గానే ఉన్నారు. ఏ చిన్న స‌మ‌స్య ఉన్నా.. ఆయ‌న చేరువగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయకులు కూడా..యార్ల‌గ‌డ్డ వెంట తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. క‌మ్మ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న గ‌న్న‌వ‌రం ప‌రిధిలో ఒక‌ప్పుడు వంశీకి జైకొట్టిన వారు.. ఇప్పుడు వెంక‌ట్రావుకు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 20, 2025 3:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago