రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించగానే చటుక్కున జగనే గుర్తుకు వస్తారు. తన పాలన ప్రారంభం నుంచి ఆయన నాడు-నేడు అంటూ.. గత టీడీపీ ప్రభుత్వానికి(2014-19) తన ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ.. ఆయన ఊరూవాడా ప్రచారం దంచి కొట్టారు. అనేక కార్యక్రమాలకు ఆయన నాడు-నేడును ఆపాదించారు కూడా. అయితే.. నాడు-నేడు అంటే కేవలం పథకాలు అమలు చేయడం.. ప్రజలకు సొమ్ములు ఇవ్వడం.. వరకే పరిమితం అని జగన్ భావించారు. వాస్తవానికి ఆయన స్కూళ్లలో మార్పులు చేశారు. అదేవిధంగా గ్రామీణ స్తాయికి వైద్యాన్నిచేర్చారు.
కానీ, అనుకున్న విధంగా నాడు-నేడు సక్సెస్ కాలేదు. దీంతో జగన్ పెట్టుకున్న నాడు-నేడు లక్ష్యంకొరగాకుండా పోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ పేరు లేదు. కానీ, నాడు-నేడు అనే మాట ప్రభుత్వం నుంచి కాకుండా ప్రజల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ప్రబుత్వం తరఫున ఎవరు ప్రజల మధ్యకు వెళ్లినా.. నాడు-నేడు అనేవారు. కానీ, ఇప్పుడు ప్రజలే నాడు-నేడు అనే పరిస్థితిని కూటమి సర్కారు తీసుకువచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ స్థాయిలో చూసుకుంటే.. రహదారులు మెరుగయ్యాయి. ఫలితంగా ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. తళతళలాడుతున్న రహదారులు కనిపిస్తున్నాయి.
దీంతో గ్రామీణుల మోములలో మందహాసం కనిపిస్తోంది. అదేవిధంగా పంచాయతీలు బలోపేతం అయ్యాయి. వైసీపీ హయాంలో రూపాయి రాక.. పైగా.. పంచాయతీలపై భారాలు మోపారన్న వాదన వినిపించింది. కానీ, ఇప్పుడు సర్కారు చొరవ కారణంగా.. కేంద్రం నుంచి వచ్చిన సొమ్ములునేరుగా పంచాయతీలకు చేరుతున్నాయి. దీంతో నాడు దుస్థితిని తలుచుకుంటూ.. నేడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పట్టణాల విషయానికి వస్తే.. ఉపాధి మెరుగు పడుతోంది. పారిశ్రామిక వేత్తల రాక.. పెట్టుబడుల కేక.. అన్నట్టుగా రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు.. ప్రపంచ దేశాల నుంచి కూడా పారిశ్రామిక వేత్తలు పరుగులు పెట్టుకుని వస్తున్నారు.
తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడుతున్నాయన్న చర్చ సాధారణ ప్రజల్లో కనిపిస్తోంది. అదేవిధంగా ఉచిత ఇసుక, ఉచితసిలిండెర్లు.. వంటివి సామాన్యులకు కలిసి వస్తున్నాయి. ఒకప్పుడు వారానికి మూడు రోజులు మాత్రమే పనులు ఉండే భవన నిర్మాణ కార్మికులు ఇప్పుడు వారం మొత్తం పనులతో బిజీగా కనిపిస్తున్నారు. అదేవిధంగా పనులకు కూడా కొదవ లేకుండా ఉంది. దీంతో నాడు.. పడిన ఇబ్బందులు తలుచుకుని.. నేడు పనులు దొరుకుతున్న ఆనందంలో మునిగి తేలుతు న్నారు. ఈ విషయాలన్నీ.. తాజాగా సర్కారు చేయించిన ఇంటింటి సర్వేలో స్పష్టంగా తేలింది. పనులు లేని వారు.. ఒకప్పుడు కనిపిస్తే.. ఇప్పుడు చేతినిండా పనులు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని సర్వేలో స్పష్టమైంది.
This post was last modified on April 20, 2025 3:10 pm
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…