రాష్ట్రంలోని 164 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజల సమస్యల పై వారు ప్రస్తావించాల్సి ఉంది. కానీ, సుమారు 90 నుంచి 100 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రజల సమస్యలను కూడా వారు పట్టించుకోవడం లేదు. పైగా.. సొంత పనులు చేసుకుంటున్నారన్నది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. ఈ విషయం.. తాజాగా ప్రజా ఫిర్యాదుల వరకు చేరింది. దీనిని సీఎం చంద్రబాబు పేషీ అధికారులకు టీడీపీ నాయకులు చేరవేశారు.
ఏం జరిగినా.. తమ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని.. కర్నూలు, అనంతపురం జిల్లాలు సహా.. విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా.. లేఖలు అందించారు. తమ ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడం లేదన్నది వారి వాదన. ఇది వాస్తవమే. ప్రభుత్వం కూడా.. సొంతగానే పనులు చేస్తోంది. రహదారుల నిర్మాణం నుంచి ఇతర మౌలిక సదుపాయాల కల్పన వరకు.. ప్రభుత్వం నేరుగా చూస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు కినుక వహిస్తున్నారు.
ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అయితే.. కొత్త నాయకులు విజయం దక్కించుకున్న దరిమిలా.. పాత నేతల హవానే నడుస్తోంది. వారు సమాంతరంగా అధికారాలు చలాయిస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలు వర్సెస్ సీనియర్ల మధ్య వివాదాలను రేపింది. దీంతో ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా పనులు జరగక.. ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. మరీ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం వస్తు న్న వారి సంఖ్య పెరుగుతోంది.
క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు.. సీనియర్ల హవా కారణంగా.. సుమారు 80 నియోజకవర్గా లలో పరిస్థితి ఇబ్బందిగానే ఉందన్న వాదన చంద్రబాబు నుంచి కూడా వినిపించింది. ఈ పరిస్థితిని మార్చాలని కూడా ఆయన చెప్పారు. అయినా.. నాయకులు వెనక్కి తగ్గడం లేదు. పిల్లలు ఎమ్మెల్యేలు అయితే.. పెద్దలు, కోడలు ఎమ్మెల్యే అయిన చోట మామాలు.. చక్రం తిప్పుతున్నారు. పోనీ.. పనులు చేస్తే బెటరే. కానీ, చేయడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో సెగ పెరుగుతుండడం గమనార్హం.
This post was last modified on April 20, 2025 12:33 pm
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…