రాజకీయాలు మహా కర్కశంగా ఉంటాయి. ప్రయోజనాలు కలిగే వరకు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. కాస్త లెక్క తేడా వస్తే చాలు చిట్టా విప్పటం మామూలే. అందునా గులాబీ దళానికి ఇలాంటి విషయాల్లో ఉండే నేర్పు అంతా ఇంతా కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలనాథుల్ని తక్కువగా అంచనా వేయటం ఎంత పెద్ద తప్పన్న విషయాన్ని అర్థం చేసుకొని.. ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యేసరికి.. పోలింగ్ వేళ దగ్గర పడింది. జరిగిన తప్పు గురించి పెద్దగా చింతించకుండా ముందు ఏదోలా డ్యామేజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు గులాబీ బ్యాచ్.
దుబ్బాక ఉప ఎన్నిక మొత్తం సర్వం తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నహరీశ్ రావుకు.. ఈ గెలుపు తన సొంత గెలుపు అన్నట్లుగా మారింది. ఈ ఎన్నికల ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే పరిణామాలు ఆయనకు తెలియనివి కావు. తమ అడ్డాలో కానీ కమలవికాసం జరిగితే.. చోటు చేసుకునే అనర్థం ఏమిటో హరీశ్ లాంటి నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బీజేపీని దెబ్బ తీసేందుకు.. తమపై వారు చేస్తున్న ప్రచారానికి.. ఎమోషనల్ ప్రచారానికి తెర తీశారు గులాబీ నేతలు. తాజాగా తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహం గురించి ఏకరువు పెట్టారు హరీశ్. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందన్న ఆయన.. బీజేపీ నేతలు ఏ నైతికతతో దుబ్బాకలో ఓట్లు అడుగుతారని నిలదీస్తున్నారు.
తెలంగాణ పౌరుడిగా తాను అడుగుతున్న 18 ప్రశ్నలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో మంత్రి హరీశ్ రావుకు గుర్తుకు రాని అన్యాయాలు దుబ్బాక పోలింగ్ వేళ గుర్తుకు రావటం ఏమిటన్న ప్రశ్నను పక్కన పెట్టేసి..ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాల్ని చూస్తే..
This post was last modified on November 2, 2020 10:54 am
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…