Political News

కియా దొంగలు దొరికారా?… గుట్టు వీడలేదా?

ఏపీలోని కియా కార్ల కంపెనీకి చెందిన 900 ఇంజిన్లు మాయమైన ఘటన నిజంగానే అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన కారు ఇంజిన్లు చోరీకి గురయ్యాయని నిర్ధారించుకున్న కియా యాజమాన్యం.. ఒకింత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా… అసలు ఈ చోరీకి సంబంధించిన గుట్టు ఇంకా వీడలేదన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తెలుగు నేల విభజన తర్వాత ఏపీకి పారిశ్రామికంగా తొలి అడుగు కియాతోనే పడిందని చెప్పాలి. ఉమ్మడి అనంతపురం జిల్లా… ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని పెనుగొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో కియా కార్ల తయారీ జరుగుతోంది. ఇక్కడ తయారయ్యే కార్లకు సంబంధించిన వివిధ విడిభాగాలు వివిధ ప్రదేశాల నుంచి ఎర్రమంచి యూనిట్ ను చేరుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైన ఇంజిన్లు విదేశాల నుంచి తమిళనాడు రాజధాని చెన్నై పోర్టుకు వస్తాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ఆ ఇంజిన్లు కియా యూనిట్ కు చేరతాయి. మరి 900 ఇంజిన్లు ఎలా మాయమయ్యాయి? అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.

కియా యూనిట్ కు చేరిన తర్వాత…కియా కంపెనీలోకి చేరిన ఏ చిన్న వస్తువు కూడా యాజమాన్యానికి తెలియకుండా బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఒకవేళ అలా వస్తే..కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగుల హస్తం తప్పనిసరిగా ఉండాల్సిందే. అలా కాకుంటే.. ఇంజిన్లు కంపెనీకి చేరకముందే మాయమై ఉండాలి. అంటే… చెన్నై పోర్టుకు చేరే సమయంలోనో, లేదంటే చెన్నై పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనో, లేదంటే చెన్నై నుంచి కియా యూనిట్ కు చేరే క్రమంలోనో ఈ ఇంజిన్లు మాయమై ఉండాలి. ఇదే నిజం అనుకుంటే…ఒకేసారి 900 ఇంజిన్లు మాయం కావడం దుస్సాధ్యం. అంటే.. నెలల తరబడి ఈ చోరీ జరిగిందని భావించక తప్పదు. 

కియా కార్ల ఇంజిన్ల మాయంపై ఏర్పాటైన సిట్ తమిళనాడుకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే వీరంతా ఎవరు? ఎక్కడివారు? కంపెనీ ఉద్యోగులా? ట్రాన్స్ పోర్టర్లా? కూలీలా?.. కియా కార్ల ఇంజిన్లను వీరు ఎక్కడి నుంచి చోరీ చేశారు? అసలు ఎంతకాలం నుంచి ఈ చోరీ జరుగుతోంది? అన్న వివరాలేమీ బయటకు రాలేదు. 9 మంది అరెస్టులనే పోలీసులు ధృవీకరించడం లేదు. అంటే…అరెస్టులు జరిగినా.. కియా కార్ల ఇంజిన్ల చోరీకి సంబందించిన గుట్టు పూర్తిగా వీడలేదన్నవాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కియా కార్ల ఇంజిన్ల చోరీ ఇప్పుడు అంతు చిక్కని సమస్యలా మారిపోయింది.

This post was last modified on April 17, 2025 7:07 pm

Share

Recent Posts

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

6 minutes ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

8 minutes ago

ఆదర్శ కుటుంబం ఇంక ఆలస్యం చేయొద్దు

ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…

13 minutes ago

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

53 minutes ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

1 hour ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

1 hour ago