Political News

గ‌ట్టిగా గెలిచినా.. ప‌ట్టు లేని త‌మ్ముళ్లు..

నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టి విజ‌యం ద‌క్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒక‌ప్పుడు వైసీపీ హ‌వాలో ఉన్న ఈ సింహ‌పురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది ప‌టాటోపంగానే ఉంద‌ని.. త‌మ‌కు ఎలాంటి ప‌వ‌రూ లేద‌ని చెప్పుకొస్తున్నారు త‌మ్ముళ్లు. వైసీపీ నుంచి కొంద‌రు నాయ‌కులు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ బాట ప‌ట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండ‌గా.. కూడా వారే అధికారంలో ఉండి చ‌క్రం తిప్పారు. దీంతో అప్ప‌టి విప‌క్షంలో ఉన్న టీడీపీ నాయ‌కులు వీరిపైపోరాటం చేశారు.

కానీ, వారు గ‌తంలో పోరాటం చేసిన వారే.. ఉద్య‌మాలు చేసి.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన వారే.. ఇప్పుడు కామ్ అయిపోయారు. కార‌ణం.. వైసీపీలో ఉండ‌గా చ‌క్రంతిప్పిన చాలా మంది నాయ‌కులు చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ట్టు పెంచుకుని.. ఇప్పుడు కూడా చెల‌రేగి పోతున్నారు. దీంతో త‌మ్ముళ్లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏమి చేతురా లింగా! అంటూ ప‌ద్యాలు పాడుకుంటున్నారు. 2024కు ముందు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్‌ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్‌కుమార్‌ యాదవ్‌ తిరిగి అంతకంటే తీవ్రంగా టీడీపీలో చ‌క్రం తిప్పుతూ.. మైనింగ్‌ చేస్తున్నారు. దీంతో టీడీపీ పాత నేత‌లు.. గ‌తంలో వీరే మైనింగ్ చేస్తున్నారంటూ ఉద్య‌మించిన త‌మ్ముళ్లు ఇప్పుడు రగిలిపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. కానీ, దానిని అడ్డు పెట్టుకుని కీల‌క గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్‌పోర్ట్‌ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నా.. త‌మ్ముళ్ల‌కు తెలిసినా.. ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు.

మ‌రోవైపు.. కీలక‌మైన‌.. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. కానీలోలోన మాత్రం కుమిలి పోతున్నారు. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన నాయ‌కుడు ఎంపీగా ఉండ‌డం, ఆయ‌న‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి లౌక్యం ఉండ‌డంతోపాటు.. ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండ‌డంతో ఆయ‌న ప‌రివారానికి ఎదురు లేకుండా పోయింది. దీంతో అయ్యో.. ఒక‌ప్పుడు వీరిపైనే యుద్ధం చేశాం.. ఇప్పుడు కూడా.. అదే ప‌నిచేస్తున్నా.. మౌనంగా ఉండాల్సి వ‌చ్చిందే.. అని వాపోతున్నారు త‌మ్ముళ్లు.

This post was last modified on April 17, 2025 1:15 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago