ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డి సీటుకే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం.. భర్తీ కానున్న ఈ సీటుకు ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను తీసుకుంటారు.
అనంతరం.. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలిస్తారు. మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక.. మే 9వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రకియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే సాగనుంది. కాగా.. ఈ ఎన్నిక ద్వారా రాజ్యసభలో అడుగు పెట్టే అభ్యర్థి కేవలం 3 సంవత్సరాల వరకే.. పెద్దల సభలో అభ్యర్తిగా ఉండనున్నారు.
2022, జూన్‌లో వైసీపీ అధినేత జగన్.. మరోసారి సాయిరెడ్డికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆయన ఈ ఏడాది మొదటి వరకు కూడా.. రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. అనంతరం.. వైసీపీకి రాజీనామా చేసి.. పెద్దల సభ నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల సభ్యత్వంలో ఇప్పటి వరకు.. అంటే.. ఆయన రాజీనామా చేసే నాటికి మిగిలిన సమయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
సో.. దీనిని ఎవరు చేపట్టినా.. మాగ్జిమం 3 ఏళ్ల వరకు మాత్రమే పెద్దల సభలో ఉండనున్నారు. తాజా పరిణామాలను బట్టి.. ఈ సీటును టీడీపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యే కోటా ఎన్నిక ద్వారా రాజ్యసభకు ఎంపిక చేసే ఎన్నిక కావడం గమనార్హం.
This post was last modified on April 16, 2025 10:29 am
ఇటీవలే అజిత్ కి గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఇటీవలే బాలకృష్ణకో…
భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన జయం రవి వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. గత ఏడాది…
సాధారణంగా యూట్యూబ్ వీడియోల ప్రారంభంలో మధ్యలో యాడ్స్ రావడం చూస్తున్నదే. ఉచితంగా చూడాలంటే దీన్ని భరించక తప్పదు. ఒకవేళ వద్దనుకుంటే…
పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలే…
సమయం ఏదైనా, సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య ప్రోత్సాహకర, పొగడ్తలతో కూడిన వ్యాఖ్యలు వినిపించవు. ఇక…