Political News

వరల్డ్ బ్యాంకు ముందు వైసీసీ వ్యూహాలు ఫ్లాప్

ఇంట్లో అభాసుపాలు అయితే తమలోనే ఏదో తప్పుందని గ్రహించాలి. ఆ తప్పును సరిదిద్దుకోవాలి. అలా కాకుండా తనను ఇంటిలోవాళ్లు గుర్తించలేకపోయారు…తాను చేస్తోంది సరైనదేనని భావించి బయటోళ్ల వద్ద అదే వాదన వినిపిస్తే… మళ్లీ అభాసుపాలు కావడం తప్పించి ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు ఏపీలో విపక్షంగా మారిన వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలే ఘోరాతి ఘోర ఓటమి. ఆపై పార్టీని వీడి నమ్మకస్తులంతా వెళ్లిపోతున్నారు. ప్రత్యర్థి శిభిరంలో చేరిపోతున్నారు. తమ కుట్రలు ఏమిటో బయటపడిపోతూ ఉన్నాయి. అయినా తీరు మార్చుకోని వైసీపీ నేరుగా ప్రపంచ బ్యాంకు వద్ద కూడా అభాసుపాలు అయిపోయింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి రుణం ఇవ్వవద్దంటూ ఆ పార్టీ చేసిన క్లంప్లైంట్లను వరల్డ్ బ్యాంకు చెత్త బుట్ట దాఖలు చేసింది. అంతేనా తాను ఇవ్వడంతో పాటుగా ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకుతోనూ రుణం ఇప్పించింది.

కూటమి అధికారంలోకి వచ్చినంతనే ఇకపై రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఒక్క క్షణం కూడా ఉండరాదన్న భావనతో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భావించారు. తన వ్యూహాలకు పదును పెట్టారు. తన పాత పరిచయాల నుబయటకు తీసిన బాబు…వరల్డ్ బ్యాంకుతో పాటుగా ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్రంలోని పెద్దలను ఇలా అన్ని మార్గాలను యాక్టివేట్ చేయగా… తొలుత వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు లైన్ లోకి వస్తే… వారితో అమరావతి నిర్మాణం కోసం రుణం విషయాన్ని ప్రస్తావించారు. ఈ చర్చలు మొదలు కాగానే… వైసీపీ ఎక్కడ రుణం మంజూరు అయిపోతుందోనని గాభరా పడిపోయింది. అమరావతి సస్టైనబుల్ రాజధాని కాదంటూ ఫిర్యాదులు చేసింది. అమరావతి వర్షమొస్తే మునిగిపోతుందని, భవనాల ఫౌండేషన కష్టమని, నిర్మాణ వ్యయాలు డబుల్ అవుతాయని, ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులే దుర్వినియోగం అయ్యాయని… ఇలా లెక్కలేనన్ని అంశాలను ప్రస్తావించింది.

అయితే ఈ ఫిర్యాదులను ఓ వైపు పరిశీలిస్తూనే మరోవైపు వరల్డ్ బ్యాంకు ఏపీ దిశగా అడుగులు వేసింది. అమరావతికి ఇచ్చే రుణానికి గ్యారెంటీ ఇస్తానని కేంద్రం చెప్పడంతో వరల్డ్ బ్యాంకుకు మరింత నమ్మకం వచ్చింది. దీంతో వైసీపీ చేసిన ఫిర్యాదులను ఓ సారి సమగ్రంగా పరిశీలించిన వరల్డ్ బ్యాంకు… అందులో ఏవో రాజకీయ దురుద్దేశ్యాలు తప్పిస్తే వాస్తవం లేదన్న విషయాన్ని గ్రహించింది. ఈ క్రమంలో ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకును కూడా రంగంలోకి దించిన వరల్డ్ బ్యాంకు..చెరో రూ.6 వేల కోట్లను రుణంగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అన్నీ చకచకా జరిగిపోతూ ఉండగా… ఇటీవలే తాజాగా వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు మరోమారు అమరావతి పర్యటనకు వచ్చారు. మరోమారు వైసీపీ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కూడా పసిగట్టిన వైసీపీ… విజయవాడలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు బస చేసిన హోటల్ కు వెళ్లి పలుమార్లు వారిని కలిసి వారిని ప్రభావితం చేసే యత్నం చేసింది.

సరే..వైసీపీ చెబుతున్న అంశాలను మరోమారు క్షేత్రస్థాయిలో పరిశీలిద్దామన్న భావనతో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు నేరుగానే రంగంలోకి దిగిపోయారట. అయితే వైసీపీ చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదన్న విషయాన్ని వరల్డ్ బ్యాంకు ప్రతినిధులకు అర్హమైపోయింది. ఇదే విషయాన్ని తమ ప్రధాన కార్యాలయానికి తెలిపిన ఆ బ్యాంకు ప్రతినిధి బృందం.. వైసీపీ చేసిన ఫిర్యాదుల్లో ఎలాంటి వాస్తవం లేదని నివేదించిందిట. ఇదే విషయాన్ని వరల్డ్ బ్యాంకు కూడా ఏపీ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసిందని సమాచారం. అంతేకాకుండా రుణ మంజూరును ఎక్కడికక్కడ అడ్డుకోవాలని వైసీపీీ చూసినా… రాజధానికి వరల్డ్ బ్యాంకు తన రుణం నిదుల్లో తొలి విడతను ఇటీవలే విడుదల చేసింది. వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన నిధులకు తన వాటా నిధులను జోడించిన కేంద్రం… ఈ నెల ప్రథమార్థంలోనే ఏపీ ఖాతాలో రూ.4,285 కోట్లను జమ చేసింది. నిధుల విడుదల మొదలైైతే… ఇక ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండదు కదా. వెరసి ఇంటిలోనే కాకుండా బయట కూడా వైసీపీ అప్రతిష్ఠ మూటగట్టుకుందన్న మాట.

This post was last modified on April 15, 2025 9:34 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

60 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago