అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తెదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని ఓటర్ల నాడిని పట్టుకోవటానికి సర్వే సంస్ధలు తెగ ప్రయత్నిస్తున్నాయి. మీడియా సంస్ధలతో పాటు అనేక సంస్ధలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో రకరకాల సర్వేలు చేస్తున్నాయి. అయితే సర్వే చేసే సంస్ధల్లో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులు, ఫ్యాకల్టీ కలిసి చేసే సర్వేకి మంచి క్రెడిబులిటి ఉందట. దీన్నీ ’2020 కో ఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ’ పేరుతో విడుదల చేశారు.
ఈ సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని అనేక వర్గాలను కలిశారు. తమ సర్వేలో విదేశీయులు, వయస్సులు, స్త్రీ, పురుషులు, అమెరికన్ల అంటూ అనేక సెక్షన్లతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఎలక్షన్ స్టడీ చెప్పింది. మొత్తం సర్వేలోని అంశాలన్నింటినీ చూసిన తర్వాత డెమక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ కు 51 శాతం మద్దతున్నట్లు తేలిందట. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 43 శాతం మందే మద్దతుగా నిలిచినట్లు తేలిందన్నారు. మరి మిగిలిన 6 శాతం ఓట్లు ఎటుపోయాయో తెలీటం లేదు.
18-44 మధ్య వయస్సున్న వాళ్ళల్లో అత్యధికులు బైడెన్ కు మద్దతుగా నిలబడ్డారట. అలాగే 65 ఏళ్ళపైబడిన వాళ్ళలో 53 శాతం మంది ట్రంప్ కు మద్దతుగా నిలబడ్డారట. ఆసియా అమెరికన్లలో 65 శాతం బైడెన్ వైపు, 28 శాతం మాత్రమే ట్రంపకు మద్దతిస్తున్నట్లు తేలిందట. ఇక అమెరికాలో అత్యంత కీలకమైన నల్లజాతీయుల్లో కేవలం 9 శాతం మాత్రమే ట్రంపు మళ్ళీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారట. నల్లజాతీయుల్లో 86 శాతం బైడెన్ కే ఓట్లేస్తామన్నారు. ఈమధ్య వివిధ రాష్ట్రాల్లో నల్లజాతీయులపై పోలీసులు దాడులు, కాల్చిచంపడాల్లాంటివి నల్లజాతీయులపై బాగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక హిస్పానిక్ అమెరికన్లలో 59 శాతం బైడెన్ వైపు నిలవగా, 35 శాతం మంది ట్రంపుకు మద్దతుగా నిలబడ్డారట. ఇదే సమయంలో అమెరికన్ల విషయం మాత్రం కాస్త సస్పెన్సుగానే నిలిచింది. అమెరికాలోని శ్వేతజాతీయుల్లో 49 శాతం మంది ట్రంపుకు మద్దతుగా నిలిచారు. 45 శాతం మంది బైడెన్ కే తమ మద్దతు అన్నారట. అంటే ఇక్కడ తేడా కేవలం 4 శాతం మాత్రమే అన్నది గమనించాలి. ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేని 6 శాతం ఓట్లే కీలకమని అర్ధమైపోతోంది.
ఇక మొత్తం మహిళలను తీసుకుంటే 55 శాతం బైడెన్ కు, ట్రంపుకు మద్దతుగా 39 శాతం ఉన్నారట. పురుష ఓటర్లలో ఇద్దరికీ చెరోసగం మద్దతుగా నిలబడ్డారని సర్వేలో తేలింది. చివరగా నిరుద్యోగుల్లో కూడా బైడెన్ కే అత్యధిక మద్దతు ఉందట. మరి తాజా సర్వే ఫలితాలను బట్టి చూస్తుంటే బైడెన్ గెలుపు ఖాయమనే అర్ధమవుతోంది. కాకపోతే సర్వే ఫలితాలు, అంచనాలన్నీ ప్రతిసారి వాస్తవం అవుతుందని అనుకునేందుకు లేదు.
This post was last modified on November 1, 2020 6:33 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…