ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరాతిని మురగబెట్టడంతో అంచనా వ్యయం పెరిగిపోయింది. దీనికి తోడు అన్ని శాఖల్లోనూ అప్పులు పేరుకుపోయాయి. దీంతో స్వయంగా రాజధానిని నిర్మించలేక.. కేంద్రం నుంచి సాయం తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే.. కేంద్రం తను ఇచ్చేదానికంటే కూడా.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో సాయం అందిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ నెలలో 3వేలకోట్ల రూపాయలపై చిలుకు మొత్తం రాజధానికి అందింది. దీంతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే.. ఇప్పుడు పనుల జోరును చూస్తున్న దేశీయ బ్యాంకులు కూడా.. క్యూ కడుతున్నాయి. మేం ఇస్తామంటే.. మేం ఇస్తామంటూ.. నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. వీటిలో ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు వంటి జాతీయ దిగ్గజ బ్యాంకులు ఉండడం గమనార్హం.
వీటి ద్వారా సుమారు మరో 26 వేల కోట్ల వరకు అందే అవకాశం ఉందని ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. తాజాగా వీటిపై సమీక్షించిన సీఎం చంద్రబాబు రుణాలు ఇచ్చే వారు పెడుతున్న షరతులను కూడా పరిశీలించాలని, రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే విధంగా ఉంటే.. ఎలాంటి అప్పులు కూడా తీసుకోవద్దని సీఆర్ డీఏ అధికారులకు తెగేసి చెప్పారు. అంతేకాదు.. స్వల్ప మొత్తాలతో కూడిన.. వడ్డీలకే తీసుకోవాలని కూడా.. సూచించారు.
ఎందుకిలా?
నిన్న మొన్నటి వరకు అసలు అమరావతికి రుణం అంటే.. మొహం చాటేసిన బ్యాంకులు ఇప్పుడుక్యూ కట్టుకుని మరీ ముందుకు రావడం ఎందుకు? దీని వెనుక ఏంజరిగిందన్న చర్చ సహజం ఈ కోణంలో చూస్తే..రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. రుణాలు ఇచ్చినా తీర్చగలిగే శక్తి రాష్ట్రం పుంజుకుంది. ముఖ్యంగా అమరావతిలో ప్రపంచ స్థాయి సంస్థలు వస్తున్నాయి. వీటి వల్ల కార్యకలాపాలు మరింత పెరుగుతాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తాజాగా దేశీయ దిగ్గజ బ్యాంకులు ముందుకు వస్తుండడం గమనార్హం.
This post was last modified on April 13, 2025 2:39 pm
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు…
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…
మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు…
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు.…
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్…