Political News

మాధవ్ చిందులు ఇంతమందిని బుక్ చేశాయా?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై తనను అరెస్టు చేసిన పోలీసులపై చిందులు తొక్కడం ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను మాజీ పోలీసు అధికారిని అని, మాజీ ఎంపీని అని పోలీసులపై ఆయన చిందులేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ తరహా మాధవ్ చిందులాట ఏకంగా 11 మంది పోలీసులపై చర్యలకు కారణంగా నిలిచింది. మాధవ్ ను అదుపులోకి తీసుకుని కూడా నిలువరించలేకపోయారంటూ గుంటూరు పరిధిలోని నగరపాలెం, పట్టాభిపురం, అరండల్ పేట పోలీస్ స్టేషన్లకు చెందిన 11 మంది పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఇటీవలే ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయగా… ఆయనను సస్సెండ్ చేసిన టీడీపీ.. ఆయనపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కిరణ్ ను అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డగించిన మాధవ్… కిరణ్ పై దాడికి యత్నించారు. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే సమయంలో మాధవ్ పోలీసులపై ఓ రేంజిలో చిందులు తొక్కారు. ఏం తమాషా చేస్తున్నారా? అంటూ ఫైరయ్యారు. ముఖానికి మాస్కు లేకుండానే నేరుగా కోర్టులోకి ప్రవేశించారు. 

ఈ దృశ్యాలన్నీ అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దీంతో ఎంత మాజీ ఎంపీ అయితేనేం, ఎంత మాజీ పోలీసు అదికారి అయితేనేం…మాధవ్ ఓ కేసులో నిందితుడు కదా. నిందితుడిని అదుపు చేయలేకపోతే ఇక పోలీసు వ్యవస్థ ఎందుకు? అన్న దిశగా పోలీసు బాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా భావిస్తూ.. అరండల్ పేట సీఐ వీరస్వామి, పట్టాభిపురం, నగరపాలెం ఎస్సైైలు రాంబాబు, రామాజంనేయులు, ఏఎస్సైలు ఆంథోనీ, ఏడుకొండలుతో పాటుగా నగరపాలెం పీఎస్ కు చెందిన ఐదుగురు, అరండల్ పేట పీఎస్ కు చెందిన ఓ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు.

This post was last modified on April 13, 2025 1:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago