Political News

జనసేన ఖాతాలో తొలి మునిసిపాలిటీ

అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మునిసిపాలిటీ పాలకవర్గాన్ని ఆ పార్టీ చేజిక్కించుకుంది. ఈ మేరకు శనివారం నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఏమంత శ్రమ పడకుండానే…పాలకవర్గం వైసీపీ నుంచి జనసేనకు అలా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏపీలో అధికార పగ్గాలు వైసీపీ నుంచి కూటమికి మారిపోయిన తర్వాత స్థానిక సంస్థలు కూడా ఒక్కటొక్కటిగానే కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల బేరసారాలూ జరుగుతున్నాయి. అధికార పార్టీ బలవంతంగా తమ ప్రజా ప్రతినిధులను లాగేసుకుంటోందని, ఈ క్రమంలో దారుణాలకూ పాల్పడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. అయితే నిడదవోలులో అలాంటి ఆరోపణలు వినిపించకపోవడం గమనార్హం. అంతా సైలెంట్ గా జరిగిపోయింది.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మునిసిపాలిటీని వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 28 కౌన్సిలర్లు ఉండగా… 27 స్థానాలను గెలిచింది. ఒక్క స్థానాన్ని టీడీపీ గెలిచింది. ఇటీవలే కూటమి అధికారంలోకి రావడం, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేశ్ గెలవడంతో వైసీపీ శిబిరంలోని 10 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరారు. మిత్రపక్షం టీడీపీకి ఉన్న ఒక సభ్యుడితో కలుపుకుని జనసేన బలం 12కు చేరగా… మరో ముగ్గురు సభ్యులు వైసీపీని వీడితే జనసేన ఖాతాలో నిడదవోలు మునిసిపాలిటీ పడిపోయినట్టే.

ఇలాంటి సందర్భంలో ఇటీవలే మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వీరి కోరిక మేరకు అధికారులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండగానే.. తాజాగా వైసీపీకి చెందిన మరికొందరు కౌన్సిలర్లు దుర్గేశ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఫలితంగా జనసేన మెజారిటీ కౌన్సిలర్లు కలిగిన పార్టీగా అవతరించింది. అంతకుముందే మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేనలో చేరిపోగా… తాజాగా ఆయననే చైర్మన్ గా కొనసాగించేలా దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు.

This post was last modified on April 12, 2025 7:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

2 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

2 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

2 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

3 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

3 hours ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

4 hours ago