ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీసుల అధికారుల సంఘం…ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయినా సరే తీరు మారని జగన్ మరోసారి పోలీసులపై నోరు పారేసుకున్నారు. పోలీసులను వాచ్ మెన్ లకంటే ఘోరంగా వాడుకుంటున్నారని జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల్లోని 10 స్థానాల్లో 9 స్థానాలు వైసీపీ గెలిచిందని చెప్పారు. అయితే, కోర్టు ఆదేశాలతో పోలీసుల భద్రతతో ఎంపీటీసీలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రామగిరి ఎస్సై సుధాకర్ పై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎంపీటీసీతో స్థానిక ఎమ్మెల్యేతో, ఆయన కొడుకుతో వీడియో కాల్ లో రామగిరి ఎస్సై మాట్లాడించి బెదిరించారని ఆరోపించారు. వైసీపీ అంటే చంద్రబాబుకు భయమని, నెక్స్ట్ ఎలక్షన్ లో సింగిల్ డిజిట్ రాని పరిస్థితికి పడిపోతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబు భయపడ్డారని, వైసీపీ అంటే ఆయనకు భయమని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. సంఖ్యాబలం లేకున్నా చంద్రబాబు దౌర్జన్యాలకు పాల్పడ్డీారని, అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. హామీల అమలులో, పాలనలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు.
చంద్రబాబుకు ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం లేదని, అన్ని పదవులు తనకు కావాలన్న అహంకారం ఉందని అన్నారు. సంఖ్యా బలం లేకపోయినా..ఎంపీటీసీ ఎన్నికలలో గెలవాలని దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ అధినేత జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు వచ్చేది సింగిల్ డిజిట్ అని, అందుకే టీడీపీకి సింగిల్ డిజిట్ అంటూ గాంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రోలింగ్ జరుగుతోంది.
This post was last modified on April 10, 2025 7:00 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…