వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మాధవ్ ను అడ్డుకున్న పోలీసులు… అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోరంట్లను అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు ప్రకటించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే అరెస్టైన నిందితుడిపై దాడి చేసేందుకు మాధవ్ యత్నించారు. అయితే అప్పటికే మాధవ్ తీరును గమనిస్తూ వచ్చిన పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేశారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా… ఐటీడీపీ నుంచి కిరణ్ ను టీడీపీ సస్పెండ్ చేసింది. కిరణ్ పై కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి.. కిరణ్ ను గురువారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడిని గుంటూరులోని ఎస్పీ కార్యాయానికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాధవ్… కిరణ్ పై దాడి చేయాలని బరిలోకి దిగారు. గతంలో పోలీసు అదికారిగా పనిచేసిన తన బుర్రకు పదును పెట్టిన మాధవ్.. కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించారు. దానిని తన వాహనంతో వెంబడించారు. మార్గమధ్యంలోనే పోలీసు వాహనాన్ని ఆపి కిరణ్ పై దాడి చేయాలని గోరంట్ల భావించినట్లుగా సమాచారం. అయితే అప్పటికే మాధవ్ ను గమనించిన మంగళగిరి పోలీసులు ఆ అవకాశాన్ని మాధవ్ కు ఇవ్వకుండా చాకచక్యంగా కిరణ్ ను గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి క్షేమంగానే చేర్చారు.
అయితే అప్పటికే కిరణ్ పై దాడి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్న మాధవ్.. తానున్నది ఎస్పీ కార్యాలయమా, లేదంటే ఇతర ప్రదేశమా? అన్న విచక్షణను కోల్పోయినట్లున్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనం నుంచి దిగి.. పోలీసు భద్రత మధ్య వెళుతున్న కిరణ్ పై గోరంట్ల దాడికి యత్నించారు. అయితే ఈ పరిణామం ఏధో జరుగుతుందని గ్రహించిన పోలీసులు గోరంట్లను నిలువరించారు. అంతేకాకుండా ఎస్పీ కార్యాలయంలోనే… పోలీసు భద్రత మధ్య ఉన్న నిందితుడి పైనే దాడి చేస్తారా? అన్న భావనతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని జిల్లా ఎస్పీకి వివరించి గోరంట్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన గోరంట్లకు ఏ తరహా శిక్ష పడుతుందో చూడాలి.
This post was last modified on April 10, 2025 6:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…