వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ పోలీసులు గురువారం ఉదయం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కాకాణి దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలో ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పోలీసులు ఈ నోటీసులు పంపారు. అయితే పోలీసులు ఈ నోటీసులు జారీ చేసే సమయానికే కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
వైసీపీ అధికారంలో ఉండగా..మంత్రి హోదాలో ఉన్న కాకాణి నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని…ఫలితంగా రూ.250 కోట్ల మేర అక్రమార్జనను ఆయన పోగేశారని ఆరోపణలు రావడం, దానిపై ప్రాథమిక విచారణలో నిజమేనని తేలడంతో పొదలకూరు పోలీసులు ఇదివరకే కాకాణి, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ రెండు వారాల నుంచి నెల్లూరు డీఎస్పీ కార్యాలయం కాకాణికి నోటీసులు పంపుతూనే ఉంది. అయితే నోటీసులు తీసుకోని కాకాణి పత్తా లేకుండాపోయారు. అసలు ఆయన గడచిన రెండు వారాలుగా ఎక్కడ ఉన్నారన్నవిషయం కూడా తేలడం లేదు.
ఈ క్రమంలో కాకాణిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మూడు సార్లు విచారణకు రమ్మంటే… పోలీసుల విచారణను లైట్ తీసుకుంటారా?అన్న దిశగా కాకాణిపై పోలీసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా విచారణకు కూడా హాజరుకాకుండా..కనీసం నోటీసులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేని కాకాణికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో కాకాణితో పాటు ఈ కేసులో ప్రత్యేక పాత్ర ఉందంటూ కాకాణి అల్లుడిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. కాకాణి మాదిరే ఆయన అల్లుడు కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కాకాణి ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయి ఉండవచ్చన్న దిశగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
This post was last modified on April 10, 2025 12:45 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…