కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణా సమాజానికి అన్యాయం చేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే దీని వెనుక బీఆర్ఎస్ వాస్తవాలను చంపేస్తోంది అంటూ కాంగ్రెస్ లెక్కలు బయట పెడుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల సమయంలో పెద్ద ఎత్తున అడవులను నాశనం చేసారు.
ఏకంగా 12 లక్షల చెట్లను మూడేళ్ళలో నరికారు. 8 వేల ఎకరాల్లో అడవిని నరికి చదును చేసారు. అప్పుడు లక్షలాది జంతువులకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇక 2015 నుండి 2022 వరకు ఏడేళ్ళలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమయంలో 219 కోట్ల మొక్కలు నాటామని, అందులో 85 శాతం బతికాయని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. దీని కోసం గానూ 9,777 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అప్పటి సర్కార్. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అలాగే అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించి ఖర్చు చేసారు.
కెసీఆర్ ప్రకటన ప్రకారం.. అటవీ విస్తీర్ణం భారీగా పెరగాల్సి ఉన్నా.. తగ్గిపోయింది. 2021 నివేదికల ప్రకారం 21,591 చ.కి.మీ 2014 నాటికి తెలంగాణాలో అడవులు ఉండగా.. 2021 నాటికి 21,213 చ.కి.మీలకు తగ్గింది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో.. కెసిఆర్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా అటవీయేతర వినియోగం కోసం కేటాయింపులు చేసారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చెట్లను నరికేశారు. అలాగే వేలం ప్రక్రియలో విక్రయించిన భూముల్లో కూడా చెట్లను పెద్ద ఎత్తున నరికారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అడవి జంతువులకు నీడ లేకుండా పోయింది. మరి దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి.
This post was last modified on April 10, 2025 6:26 am
వాస్తవానికి ఈ వారం విడుదల కావల్సిన సినిమా సారంగపాణి జాతకం. ఆ మేరకు ముందు ప్రకటన ఇచ్చింది కూడా ఈ…
సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…