వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులతో పాటుగా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నం ఘటనలు కీలకమైనవి. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది చాలానే చేశారు. అలాంటి వారిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఒకరు.
చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన రమేశ్… ఆ తర్వాత ఇట్టే జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి పాలనలో పోలీసు విచారణకు హాజరవుతూ నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఇదే కేసులో మరోమారు విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం జోగి రమేశ్ కు నోటీసులు జారీ చేశారు.
చంద్రబాబు ఇంటిపైకి దాడికి బయలుదేరిన జోగి రమేశ్.. తన వెంట మందీమార్బలాన్ని వేసుకుని మరీ రంగంలోకి దిగిపోయారు. సమయానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వేగంగా స్పందించబట్టి సరిపోయింది గానీ.. లేదంటే జోగి రమేశ్ తన వర్గంతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడి చేసేవారే.
నాడు చంద్రబాబు ఇంటి సమీపంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ బాహాబాహీకి దిగిన నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తోపులాటలో బుద్ధా వెంకన్న పట్టు తప్పి పడిపోయారు. కాసేపు ఊపిరాడక ఆయన సతమతమయ్యారు. వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులు ఆయనను కాస్తంత దూరం తీసుకెళ్లి కూర్చోబెట్టగా చాలా సేపటికి గానీ ఆయన మామూలు మనిషి కాలేకపోయారు. ఈ వ్యవహారంపై నాడే పోలీసులు కేసులు నమోదు చేసినా.. విచారణ మాత్రం జరగలేదనే చెప్పాలి. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఎలా వ్యవహరించారో… బాబు ఇంటిపై దాడి యత్నంపైనా అదే రీతిన స్పందించారు.
తాజాగా 10 నెలల క్రితం టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసుల బూజును పోలీసులు దులిపేశారు. బాబు ఇంటిపై దాడికి యత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేశ్ ను సీఐడీ పోలీసులు ఇప్పటికే మూడు పర్యాయాలు విచారించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేయాలంటే అందుకు జోగి రమేశ్ ససేమిరా అన్నారు. పలు కారణాలు చెబుతూ ఆయన తన ఫోన్ ను పోలీసులకు సమర్పించలేదు.
తాజాగా ఇదే కేసులో ఈ నెల 11న మరోమారు విచారణకు రావాలంటూ బుధవారం సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరి ఈ సారైనా పోలీసులు అడిగినట్లుగా జోగి రమేశ్ తన ఫోన్ ను వారికి స్వాధీనం చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జోగి రమేశ్ ఫోన్ తమ చేతికి చిక్కితే.. బాబు ఇంటిపైకి దాడికి పురిగొల్పిన వారు ఎవరన్న విషయం ఇట్టే తేలిపోతుందన్నది పోలీసుల భావన. మరి ఈ చిక్కుముడిని పోలీసులు ఈ దఫా అయినా విప్పుతారో, లేదో చూడాలి.
This post was last modified on April 9, 2025 7:16 pm
సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఆ తర్వాత ఎవరితో చేయాలనే విషయంలో…
మే 9 విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడుతుందనే పుకార్ల నేపథ్యంలో ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ నుంచి…
వాస్తవానికి ఈ వారం విడుదల కావల్సిన సినిమా సారంగపాణి జాతకం. ఆ మేరకు ముందు ప్రకటన ఇచ్చింది కూడా ఈ…
సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…