తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు చేరడం, తెలంగాణ శాసన సభ స్పీకర్ కు సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించడం చర్చనీయాంశమైంది. ఎప్పటి లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే తాజాగా కడియం శ్రీహరిపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాను కేసీఆర్ కు విశ్వాసమైన కుక్కలా ఉంటానని, కానీ, అధికారం కోసం పార్టీ మారే కడియం శ్రీహరి వంటి గుంట నక్క కాదని విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంట నక్క అంటూ పల్లా దుయ్యబట్టారు. తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని పల్లా చెప్పారు.
కేసీఆర్ చేసిన పనులను తామే చేశామని చెప్పుకునేందుకు కడియం శ్రీహరికి సిగ్గుండాలని పల్లా విమర్శించారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి కడియం అడ్డుపడ్డారని, 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కూడా ఆపారని ఆరోపించారు.
అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజేశ్వర్ రెడ్డి చౌకబారు విమర్శలు మానుకోవాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బొచ్చు కుక్క అంటూ మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకోవాలని కడియం షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ తో ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించింది పల్లా అని, కేసీఆర్ ను అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నదెవరో ప్రజలకు తెలుసని పల్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…