Political News

క‌మ్యూనిస్టులకు కొత్త సార‌థి.. ఎవ‌రంటే!

క‌మ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సార‌థి వ‌చ్చారు. తమిళ‌నాడులో జ‌రుగుతున్న 24వ అఖిల భార‌త మ‌హా స‌భల వేదిక‌గా.. కొత్త నాయ‌కుడిని ఎన్నుకుంటూ క‌మ్యూనిస్టులు తీర్మానం చేశారు. సుదీర్ఘ‌కాలంగా పార్టీతో అనుబంధంతోపాటు.. పార్టీకి హోల్ టైమ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంఏ బేబీకి ఈ ద‌ఫా సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ద‌క్కింది. ఈ మేర‌కు ఆయ‌న పేరును సీపీఎం స‌మ‌న్వ‌య క‌ర్త‌, తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌కాశ్ కార‌త్ ప్ర‌తిపాదించారు. దీనిని స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. దీంతో సీపీఎంకు గ‌త కొంత‌కాలంగా ఖాళీగా ఉన్న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు భ‌ర్తీ అయింది.

ఎవ‌రీ బేబీ..?

ఎంఏ బేబీ అంటే పురుష నాయ‌కుడు. స‌హ‌జంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బేబీ అంటే.. మ‌హిళ అనే కోణంలోనే వాడినా.. కేర‌ళ‌కు చెందిన బేబీ.. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఈయ‌న కేర‌ళ‌ల‌లో బ‌ల‌మైన నాయ‌కుడు కూడా. గ‌తంలో ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. నిజాయితీతో కూడిన నాయ‌కుడిగా..కుటుంబం యావ‌త్తు పార్టీకే ప‌నిచేస్తున్న నేప‌థ్యంలో బేబీ పేరును కార‌త్ ప్ర‌స్తావించారు. అయితే.. దీనికి ముందు సుదీర్ఘ క‌స‌ర‌త్తు జ‌రిగింది. ఆయ‌న పేరును సీపీఎం ఏక‌గ్రీవంగా ఆమోదించిన ద‌రిమిలా.. ఆయ‌న‌ను ప్ర‌క‌టించారు.

బీవీ రాఘ‌వులు అవుట్‌!?

సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు.. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సీతారాం ఏచూరి ఉన్నారు. అయితే.. హృధ‌య సంబంధిత స‌మ‌స్య‌తో ఆయ‌న ఆక‌స్మికంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. అనేక మంది పేర్లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తెలుగు వాడైన బీవీ రాఘ‌వులుకు కూడా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. సామాజిక వ‌ర్గం ప్ర‌కారం.. ఆయ‌న ఉన్న‌త త‌ర‌గ‌తికి చెందిన నాయ‌కుడు కావ‌డం, ఈ ద‌ఫా మైనారిటీ వ‌ర్గాల‌కు(వ‌క్ఫ్‌కు అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో) ఇవ్వాల‌ని సీపీఎం కేంద్ర క‌మిటీ నిర్ణ‌యించ‌డంతో బేబీకి అవ‌కాశం చిక్కింది.

కేబినెట్ హోదా!

పార్టీప‌రంగా చూసుకుంటే.. సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కేబినెట్ హోదాతో కూడిన ర్యాంకు ఉంటుంది. అది అన‌ధికారిక‌మే అయినా.. పార్టీ ఆమేర‌కు చెల్లింపులు చేస్తుంది. విమాన చార్జీలు, ర‌వాణా చార్జీలు స‌హా .. దేశ‌వ్యాప్తంగా కార్య‌ద‌ర్శి తిరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ చార్జీల‌ను పార్టీనే భ‌రిస్తుంది. అదేవిధంగా ఆయ‌న పార్టీకి చీఫ్‌గా ఉంటూ.. తీసుకునే నిర్ణ‌యాల‌కు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తే.. ఆయ‌నే స్వ‌యంగా హాజ‌రు అయ్యే అవ‌కాశంపొలిట్ బ్యూరో.. ఇలా.. అన్ని విధాలా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు అత్యంత కీల‌క‌మ‌నే చెప్పాలి.

This post was last modified on April 6, 2025 8:18 pm

Share

Recent Posts

ఆ ఒక్క ఫోటో ఆమె కేరీర్ ను దెబ్బతీసింది

సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…

6 minutes ago

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు….

బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…

19 minutes ago

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

2 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

4 hours ago