Political News

ఏపీ రైజింగ్… వృద్ధిలో దేశంలోనే రెండో స్థానం

ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుడా కేవలం ఏడాది వ్యవధిలో రాష్ట్రం తన వృద్ధి రేటును ఏకంగా 2 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ వృద్ధిని నమోదు చేయడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. ఇదే దూకుడును కొనసాగిస్తే… త్వరలో రాష్ట్రం వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ వన్ స్టానంలో నిలవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ గణాంకాల్లో తనదైన దూకుడు ప్రదర్శించిన తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. అత్యధికంగా 9.69 శాతం వృద్ది రేటుతో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అదే సమయంలో 8.21  వృద్ది రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.19 శాతం వృద్ది రేటును నమోదు చేసిన ఏపీ గడచిన ఏడాదిలో 2 శాతానికి పైబడి వృద్ది రేటును పెంచుకోవడం గమనార్హం.

ఈ గణాంకాలను చూసిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. గడచిన 10 నెలల కాలంలోనే విధ్వంసకర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగలిగామని ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాతిశయాన్ని ప్రకటించారు. వ్యవసాయం, ఉత్పత్తి రంగం, సేవల రంగాల్లో విశేష పురోగతి సాధించామన్న ఆయన…ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించడంతోనే రాష్ట్ర వృద్ధిరేటు పెరుగుదలకు దోహదపడిందని ఆయన అబిప్రాయపడ్దారు. ఇదే జోరును కొనసాగిస్తూ ముందుకు సాగుదామని.. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదామని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

This post was last modified on April 6, 2025 8:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

1 hour ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ ప్ర‌పంచ శాంతి పుర‌స్కారం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago