దేశంలో `వన్ నేషన్-వన్ ఎలక్షన్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్రం తలపోస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన పని పూర్తి చేసి.. ఆరు మాసాల కిందటే కేంద్రానికి నివేదికసమర్పించింది. ఇక, అప్పటి నుంచి కూడా.. జమిలి ఎన్నికలపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణల్లోనూ ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు జమిలి వస్తోందని హంగామా చేస్తున్నాయి.
ఏపీలో అయితే.. 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అదినేత జగన్.. తన పార్టీ నాయకులతో ఎప్పుడు భేటీ అయినా.. ఇంకే ముంది.. ఎన్నికలకు ఆట్టే సమయం లేదని.. మనదే గెలుపు పక్కా అని చెబుతున్నారు. దీంతో నాయకులు కొంత ఊరట చెందుతున్నారు. ఇక, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా.. ఇదే పాట పాడుతున్నారు. ఎన్నికలు వచ్చేస్తున్నాయని.. ఇటీవల ఆయన పార్టీనాయకులతోనూ వ్యాఖ్యానించారు. వీరి ఆశలన్నీ.. జమిలిపైనే ఉన్నాయి. అయితే.. కేంద్రం నుంచి ఇప్పటి వరకు పెద్దగా క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు.
జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2029లో వచ్చే సాధారణ ఎన్నికల తర్వాతే.. ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుందని.. అప్పుడే దీని కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమవుతుందన్నారు. అప్పటి వరకు వచ్చే వన్నీ ఊహాగానాలేనని ఆమె కొట్టి పారేశారు. శనివారం సాయంత్రం చెన్నైలో జరిగి ఓ కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జమిలి ఎన్నికలపై దాదాపు ఒక స్పష్టత ఇచ్చారు. ఇదేసమయంలో జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లను ఆమె కొట్టి పారేశారు. రాబోయే 2029 ఎన్నికలు సాధారణంగానే జరుగుతాయని తెలిపారు.
ఇక, జమిలి ఎన్నికల ద్వారా.. దేశ ప్రజలు కడుతున్న సొమ్మును ఆదా చేయనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. “2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అలా కాకుండా.. ఏక కాల ఎన్నికల నిర్వహణ ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చు.“ అని ఆమె చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీ దాదాపు 1.5 శాతం వృద్ధి చెందుతుందని వివరించారు. ఇక, వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది మోడీ ప్రవచిత ఫార్ములా అని ప్రచారం చేస్తున్నారని.. కానీ, ఇది చాలా తప్పని అన్నారు. 1960ల నుంచే జమిలి ఎన్నికల ప్రతిపాదన ఉందన్నారు.
This post was last modified on April 6, 2025 6:57 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…