ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. అయితే ఎల్లకాలం అవే పరిస్థితులు ఉండవు కదా. ఇతరత్రా రంగాలకు మాదిరిగానే సర్కారీ వైద్య రంగంలోనూ ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఏపీలోని కూటమి సర్కారు నడుం బిగించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి?.. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలంటే… ఇంకెన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సి రావచ్చు అన్నదానిపై ఓ నివేదికను తయారు చేయాలని ఆయన అదికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం ఎంత మేర నిధులు అవసరం అవుతాయన్న దానిపైనా నివేదికలో పొందుపరచాలని ఆయన సూచించారు.
గ్రామ స్థాయిలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో కొనసాగుతున్న కమ్యూనిటి హెల్త్ సెంటర్ (సీహెచ్ సీ)లల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్ సీ, సీహెచ్ సీల్లో అవసరమైతే… వర్చువల్ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ తరహా సేవల ద్వారా ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు లభించే అవకాశం ఉంటుందని, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం రాదని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్దారు.
This post was last modified on April 4, 2025 9:25 pm
అదేదో పెద్దలు చెప్పిన సామెత 'కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు…' గత వైసీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు…
ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ…
క్రాక్, వీరసింహారెడ్డి, డాన్ శీను లాంటి బ్లాక్ బస్టర్లతో కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న గోపిచంద్ మలినేని…
నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ 'జాక్'కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం…
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి…
నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్…