జనసేన నాయకుడు.. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజయం దక్కించుకున్న కొణిదల నాగబాబు.. రంగంలోకి దిగిపోయారు. తన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహిస్తున్న పలు అధికారికా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నా రు. అయితే .. గతంలోనూ ఆయన ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. అప్పట్లో ఎలాంటి ప్రొటోకాల్ లేదు. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ
కావడంతో ఆ ప్రొటోకాల్ ప్రకారం.. నాగబాబు సదరు కార్యక్రమాల్లో పాల్గొ నడం గమనార్హం.
పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిం దే. శుక్రవారం ఉదయం నియోజకవర్గానికి వచ్చిన నాగబాబు.. స్థానిక గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధి లో రూ. 88.98 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను జనసేన పార్టీకే చెందిన కీలక నాయకుడు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రారంభించారు.
ఈ సౌకర్యాలతో పిఠాపురం ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యానించారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురం తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కంచుకోటగా మారిందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలే కాదు.. ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. ఇక్కడ గెలుపు జనసేనదేనని నాగబాబు చెప్పుకొచ్చారు.
కాగా.. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించా రు. ఇక, టీడీపీ మరో నేత, పవన్ కోసం సీటును త్యాగం చేసిన వర్మకు మా్త్రం ఎలాంటి పిలుపు అందలేద నిఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై వారు ఆగ్రహంతో ఉండడం గమనార్హం. పార్టీ తరఫున కార్యక్రమం కాదని.. ప్రభుత్వం తరఫునే నిర్వహించారని.. అలాంటప్పుడు కనీసం.. మాజీ ఎమ్మెల్యే హోదాలో అయినా.. వర్మకు ఆహ్వానం ఉండి ఉండాల్సిందని అంటున్నారు.
This post was last modified on April 4, 2025 3:15 pm
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…