Political News

మీ ఇల్లు – మీ లోకేష్‌: చేతికి మ‌ట్టంట‌ని పాలిటిక్స్ ..!

స‌మాజంలోని ఏ కుటుంబ‌మైనా.. త‌మ‌కు ఓ గూడు కావాల‌ని త‌పిస్తుంది. అయితే.. అంద‌రికీ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. పేద‌లు,.. అత్యంత నిరుపేద‌ల‌కు ఇది సాకారం కావాలంటే.. వారి జీవిత‌కాలం స‌రిపోతుంది. అందుకే.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్‌.. ‘మీ ఇల్లు-మీ లోకేష్‌’ పేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇది స‌క్సెస్ అయితే.. త‌మ‌కు తిరుగులేని ఎన్నిక‌ల రాజ‌కీయం అవుతుంద‌న్న లెక్క‌లు వేసుకున్నారు.

ఏంటీ ప‌థ‌కం..
మీ ఇల్లు-మీ లోకేష్ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఏమీ ఉండ‌దు. ప్ర‌భుత్వానికి రూపాయి ఖ‌ర్చు కూడా కాదు. కానీ, ఇదేస‌మ‌యంలో మంత్రి నారా లోకేష్‌కు భారీ ఎత్తున ఓట్ల‌ను తీసుకురానుంది. అస‌లు ఈ కార్య‌క్ర‌మంలో ఏం చేస్తారంటే.. పేద‌లు చాలా మంది ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకుని.. లేదా.. ప్ర‌భుత్వ భూముల్లో చిన్న‌పాటి గుడిసెలు వేసుకుని ద‌శాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. అయితే.. స‌ర్కార్లు త‌లుచుకుంటే.. వీరిని అక్క‌డ నుంచి త‌రిమేయొచ్చు.

వైసీపీ హ‌యాంలో ఇదే జ‌రిగింది. మీకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నామ‌ని చెబుతూ.. అప్ప‌టికే నివాసం ఏర్పా టు చేసుకున్న పేద‌లను ఆయా భూముల నుంచి ఖాళీ చేయించింది. చెప్పిన ప్ర‌కారం.. వారికి వేరే చోట భూములు ఇచ్చింది. కానీ, ఇళ్ల ను మాత్రం నిర్మించ‌లేదు. అయితే.. ఇవి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు సుదూరం గా ఉండడం.. ఇళ్లు నిర్మించుకునేందుకు ల‌క్ష‌ల రూపాయ‌లు కావాల్సి ఉండ‌డంతో ఇది విఫ‌ల‌మైంది. అందుకే.. జ‌గ‌న్‌.. త‌ను ఇచ్చిన ఇళ్లు త‌న‌కు ఓట్లేస్తాయ‌ని ఆశించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టిన నారా లోకేష్‌.. వారు ఆక్ర‌మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకు న్న భూముల‌ను వారిపేరుతోనే రిజిస్ట్రేష‌న్ చేయించి.. ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చారు. ఇప్పుడు.. అదే కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీకారం చుట్టి.. మీ ఇల్లు- మీ లోకేష్ పేరుతో అమ‌లు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబానికి ఆయ‌న మంగ‌ళగిరిలో ప‌ట్టా కూడా ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం ఏమీ చేయ‌దు. వారి ఇల్లు వారే ఇప్ప‌టికి నిర్మించుకున్న నేప‌థ్యంలో కేవలం ఎలాంటి ఖ‌ర్చులేకుండా.. ప‌ట్టా ఇస్తుంది. ఇది స‌క్సెస్ అయితే.. నారా లోకేష్‌కు తిరుగులేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12 నుంచిఈ కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో అమ‌లు కానుంది.

This post was last modified on April 4, 2025 12:20 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

8 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago