వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలపై జగన్ తోడబుట్టిన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయటే ఉంటే… వివేకా కూతురు సునీత ప్రాణాలకు రక్షణ ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. అవినాశ్ బయటే యథేచ్ఛగా తిరుగాడుతుండగా… కేసులో కీలక సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతున్నారని ఆమె ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సునీత ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వివేకా హత్య జరిగిన సమయంలో సునీత గానీ, సునీత భర్త గానీ అక్కడ లేరన్న షర్మిల… అక్కడ ఉన్నది ఒక్క అవినాశ్ రెడ్డేనని తెలిపారు. వివేకా హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయారని చెప్పింది కూడా అవినాశేనని కూడా ఆమె ఆరోపించారు. కేసును తారుమారు చేసేందుకు అవినాశ్ ఆది నుంచి యత్నిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని కూడా ఆమె తెలిపారు. కేసునే తారుమారు చేసేందుకు యత్నించిన అవినాశ్ ఇప్పటికీ బెయిల్ పై యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారన్న షర్మిల..ఇప్పటికీ కేసును తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు కేసులో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఆమె ప్రశ్నించారు. అవినాశ్ బయట ఉండగా.. కేసులో కీలక సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతున్న విషయాన్ని కూడా గమనించాలని ఆమె గుర్తు చేశారు.
కేసు దర్యాప్తు తీరు చూస్తుంటే.. సునీత ప్రాణాలకు రక్షణ లేదని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. సునీతకు ఏమైనా అయితే ఆమెకున్న ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సీబీఐ అధికారి రాంసింగ్ నే తన ఇంటికి పిలిపించుకుని మరీ అవినాశ్ ఆయనను బెదిరించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా సునీతనే తన తండ్రిని చంపేసినట్లుగా కేసును మార్చేసి.. దానిపై విచారణాధికారి రాంసింగ్ చేత సంతకం చేయించారని కూడా షర్మిల సంచలన ఆరోపణ చేశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అవినాశ్ బయటే ఉంటే… సునీత ప్రాణాలకు ముప్పు ఉందని భావించక తప్పడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెరసి ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్న అవినాశ్ రెడ్డి బెయిల్ ను కేంద్రంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
This post was last modified on April 4, 2025 9:07 am
నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ 'జాక్'కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం…
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి…
నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్…
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు…
భారీ అంచనాల మధ్య విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ చూసి అజిత్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. దర్శకుడు అధిక్ రవిచందర్…
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…