జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా పర్యాటక రంగంలో కూడా పెట్టుబడులు సాధించవచ్చన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో పాటుగా ఏపీ పర్యాటక శాఖకు పెట్టుబడులు రాబడుతూ తనదైన ప్రత్యేక శైలిని ఆయన చాటుతున్నారు. ప్రభుత్వ పాలనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా దుర్గేశ్ ది విభిన్న శైలే. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ తంతును చూస్తేనే ఈ విషయం ఇట్టే అర్థం అయిపోతుంది. ఈ విభిన్న చతురతతోనే దుర్గేశ్ నిడదవోలు పురపాలక సంఘంపై జనసేన జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధం చేశారు.
అన్ని పురపాలికల మాదిరే వైసీపీ అధికారంలో ఉండగా… 2021లోనే నిడదవోలు మునిసిపాలిటీకి ఎన్నికలు జరగగా… అన్ని ప్రాంతాల మాదిరే నిడదవోలు కూడా వైసీపీ ఖాతాలోనే పడిపోయింది. నాడు వైసీపీ నేత శ్రీనివాస నాయుడు ఎమ్మెల్యేగా ఉండగా.. వైసీపీకి చెందిన భూపతి ఆదినారాయణ, కామిశెట్టి సత్యనారాయణ మునిసిపల్ చైర్ పర్సన్ పదవి కోసం పోటీ పడ్డారు. ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చి చెరి రెండున్నరేళ్ల పాటు అంటూ నాయుడు మధ్యే మార్గంగా తీర్పు చెబితే… అందుకు సమ్మతించిన భూపతి తొలుత తానేనని చైర్మన్ పీఠం ఎక్కారు. అయితే రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత పదవి నుంచి దిగేందుకు భూపతి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో కామిశెట్టి, భూపతిల మధ్య వివాదం నెలకొన గా..అది తీరకుండానే 2024 ఎన్నికలు వచ్చేశాయి. వైసీపీ అధికారం కోల్పోయింది. నాయుడు కూడా ఓడిపోయారు.
నాయుడును ఓడించిన దుర్గేశ్ కొత్త ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏకంగా మంత్రి కూడా అయ్యారు. అప్పుడే ఆయన నిడదవోలుపై పట్టు సాధించే దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగా భూపతిని జనసేన వైపు లాగేశారు. దుర్గేశ్ కదిపిన పావులతో భూపతి వైసీపీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లతో రాజీనామా చేయించి మరీ వారితో కలిసి జనసేనలో చేరిపోయారు. అంటే… ఫలితంగా 27 మంది కౌన్సిలర్లు ఉన్న వైసీపీ బలం 16కు పడిపోయింది. టీడీపీకి ఉన్న ఓ కౌన్సిలర్ ను కలుపుకుంటే… జనసేన బలం 12కు చేరింది. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు వైసీపీని వీడి జనసేనలో చేరితే.. నిడదవోలు పురపాలికపై జనసేన జెండా ఎగిరినట్టే. ఈ తంతుకూ దుర్గేశ్ తెలివిగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పాలక వర్గం మార్పు తన ప్రమేయం లేకుండా జరుగుతున్నట్లుగా దుర్గేశ్ పక్కా పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న భూపతి ఆదినారాయణ పార్టీ ఫిరాయించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వైసీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇప్పటిదాకా కలెక్టర్ అయితే చర్యలు తీసుకోలేదు గానీ… చర్యలు తీసుకుంటే… వైసీపీ శిబిరంలోని మరో ముగ్గురు కౌన్సిలర్లను లాగేసుకుని నిడదవోలు మునిసిపాలిటీపై జనసేన జెండాను ఎగురవేయాలని దుర్గేశ్ కాసుకుని కూర్చున్నారట. ఆయా పాలక వర్గాలను చేజిక్కించుకునేందుకు అందరూ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను లాగేస్తుంటే…వారందరినీ భిన్నంగా సాగుతున్న దుర్గేశ్ ఏకంగా చైర్మన్ నే లాగేసి…వైరి వర్గంతోనే అదికారులకు ఫిర్యాదు చేయించి..పాలకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారంటే… దుర్గేశ్ రూటు సెపరేటు అని చెప్పక తప్పదు కదా.
This post was last modified on April 3, 2025 10:28 pm
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…