వైసీపీ ప్రభుత్వం పర్యాటక, యువజన శాఖల విషయంలో అప్పటి మంత్రులు తీసుకున్న నిర్ణయాలు.. ఇచ్చిన జీవోలపై పునః సమీక్షకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వీటిని పునః పరిశీలించి నిర్ణయం తీసుకునేలా తాజాగా జరిగిన మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. దేశంలో డ్రోన్ వ్యవస్థకు జవసత్వాలు ఇవ్వాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. వచ్చే రెండేళ్లలో డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది.
ఈక్రమంలో తాజాగా గురువారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక ‘ఏపీ డ్రోన్ కార్పొరేషన్’ ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి స్వయం ప్రతిపత్తికల్పించారు. తద్వారా.. మహిళలు, నిరుద్యోగులకు డ్రోన్ ల ద్వారా ఉపాధి కల్పించే అవకాశం మెరుగు పడనుంది.
ఇక, ఇప్పటి వరకు ఏపీ డ్రోన్ వ్యవస్థ.. స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్)లో భాగంగా ఉండేది. అయితే.. ఈ రెండు వ్యవహారాలు భిన్నమైన అంశాలు కావడంతో సర్కారు.. ఈ రెండింటిని విడదీసింది. మరోవైపు.. వైసీపీ హయాంలో యువజన, పర్యాటక శాఖలు జారీ చేసిన జీవోలను పునః పరిశీలించేందు కు(ర్యాటిఫికేషన్)కు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. అనకాపల్లి జిల్లాలో పెట్టుబడులకు అనుమతులు తెలిపింది. దీంతో డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటు కానుంది.
కీలకమైన మరో నిర్ణయానికి వస్తే.. కొన్నాళ్లుగా డిమాండ్‌గా ఉన్న బార్ల లైసెన్సు ఫీజులను ప్రభుత్వం కుదించింది. ప్రస్తుతం 50 నుంచి 75 లక్షల వరకు ఉన్న(ప్రాంతాన్ని బట్టి) త్రీ స్టార్ హోటళ్లు, 5 నక్షత్రాల హోటళ్లలోని బార్లకు ఫీజులను రూ.25 లక్షలకు తగ్గిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదల ఇంటి నిర్మాణానికి కూడా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లు నిర్మించే హడ్కో కు 710 కోట్లను ప్రభుత్వ గ్యారెంటీతో రుణం అందించేందుకు కేబినెట్ నిర్ణయించింది.
This post was last modified on April 3, 2025 3:28 pm
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…
జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు శనివారం కూడా.. పిఠాపురంలో పర్యటించారు. శుక్రవారం పిఠాపురానికి వెళ్లిన ఆయన..…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేసవి కాలం ప్రారంభం అయిన నేపథ్యంలో సాగు, తాగు నీటి…
ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం వచ్చిన 7జి బృందావన కాలనీ ఒక క్లాసిక్. నిర్మాత ఏఎం రత్నం కొడుకు రవికృష్ణ…
టీడీపీ అధినేత చంద్రబాబు స్టయిలే వేరు. పార్టీ నాయకుల విషయంలో ఆయన అన్ని కోణాల్లోనూ పరిశీ లన చేస్తారు. వినయ…