వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం ఓ కొత్త అవతారంలో కనిపించారు. ఫక్తు రాజకీయ నేతగా కనిపించిన అంబటి… బుధవారం మాత్రం న్యాయవాదిగా కనిపించారు. ఎంచక్కా న్యాయవాదులు వేసుకునే డ్రెస్ కోడ్ లోకి మారిపోయిన అంబటి.. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే వాదించుకునేందుకు రంగంలోకి దిగారు. కోర్టు అనుమతితోనే న్యాయవాది రూపంలో వచ్చిన అంబటి…తన పిటిషన్ విచారణ వాయిదా పడటంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా తాను కోర్టుకు వచ్చిన విషయం, దాని వివరాలు ఇవీ అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
గతేడాది నవంబరులో అంబటిపైనా, ఆయన కుటుంబంపైనా, ఆయన కుమార్తెలపైనా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేశారట. దీనిపై గుంటూరు పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అంబటి… గతేడాది నవంబర్ 11న ఐదు ఫిర్యాదులు చేశారట. వీటిలో నాలుగు కేసులు తన కుటుంబంపై అసభ్య పోస్టులకు సంబంధించినవి అయితే… మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులకు సంబంధించిన ఫిర్యాదు అట. ఈ ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసులు మాత్రం నమోదు చేయలేదట. దీంతో అంబటి అదే నెల 25న గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి అవే ఫిర్యాదులను అందజేశారట. అయినా కూడా కేసులు నమోదు కాలేదట.
ఇలాగైతే కాదనుకుని భావించిన అంబటి… తన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని తెలుపుతూ జనవరిలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారట. దీంతో అంబటి ఇచ్చిన నాలుగు ఫిర్యాదులపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారట. అయితే జగన్, జగన్ ఫ్యామిలీపై అసభ్య పోస్టుల వ్యవహారంలో మాత్రం కేసు నమోదు చేయలేదట. ఇక నమోదు చేసిన కేసుల్లోనూ తాను ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రస్తావిస్తే… ఆ పేరు లేకుండానే కేసు నమోదు చేశారట. ఇక జగన్, జగన్ ఫ్యామిలీపై మార్ఫింగ్ ఫొటోలతో కూడిన పోస్టులు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారట. దీంతో లోకేశ్ పై కేసు నమోదు చేయాలని తాను కోరితే… పోలీసులు ఇప్పటిదాకా స్పందించలేదని అంబటి వాపోయారు.
This post was last modified on April 3, 2025 10:23 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…